34 ఏళ్ల వయసులోనే కిరణ్ పోలార్డ్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల ఈ విషయాన్ని తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు. ఎంతో ఆలోచించిన తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నానని.. రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ జట్టుకు ఎప్పుడు తోడు ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్ళ వరకు తనకు మద్దతుగా నిలిచిన క్రికెట్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు కిరణ్ పోలార్డ్. కాగా ప్రస్తుతం కిరణ్ పోలార్డ్ వెస్టిండీస్ పరిమిత ఓవర్ల జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. కాగా ఈ స్టార్ ప్లేయర్ ప్రస్తుతం వెస్టిండీస్ క్రికెట్ లో పవర్ హిట్టర్ గా పేరు సంపాదించాడు.
మరి ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన పోలార్డ్ క్రికెట్ కెరీర్ గణాంకాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ఇప్పుడు వరకు 123 వన్డే మ్యాచ్లు ఆడాడు పొలార్డ్. 2706 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో యాభై ఐదు వికెట్లు తీశాడు. 101 అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు ఆడిన పొలార్డ్ 1769 పరుగులు చేసి 42 వికెట్లు పడగొట్టాడు..ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 184 మ్యాచ్లు ఆడిన పొలార్డ్ 3350 పరుగులు చేశాడు. అంతేకాకుండా అరవై ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక వన్డే క్రికెట్ లో మూడు సెంచరీలు 16 హాఫ్ సెంచరీలు ఉండగా.. టీ-20 ఫార్మెట్లో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో 16 అర్థ శతకాలు నమోదు చేశాడు కిరణ్ పోలార్డ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి