ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఆరింట ఓడిన ముంబై మిగిలిన ఎనిమిది మ్యాచ్ లలో గెలిచి ప్లే ఆప్స్ రేస్ లో నిలుస్తుందా అన్న ఆశలు అభిమానులలో అయితే లేవని చెప్పాలి. ఇప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్లు ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే ఇది సాధ్యం అయ్యేలా లేదు. కాగా ఈ రోజు చెన్నై తో జరుగుతున్న మ్యాచ్ లోనూ ఓటమికి దగ్గరగా ఉంది. ముందుగా టాస్ గెలిచినా చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. మొదటి ఓవర్లోనే రోహిత్ ఇషాన్ లు అవుట్ అయ్యి జట్టును పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశారు. ఇక బ్రెవిస్ మరియు సూర్యకుమార్ లు కూడా వెంటనే అవుట్ అవ్వడంతో ముంబై కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. దీనితో ముంబై గెలుపు కోసం చెన్నై తో పోరాడుతోంది.
కనీసం 150 పరుగులు అయినా చేస్తే కాస్త గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. ముంబై ఈ స్కోర్ చేస్తే బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ బృందం ఏమి చేస్తుంది అనేది చూడాలి. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే కాసేపు వరకు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి