అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న యువ బౌలర్లు భారత క్రికెట్ లో దిగ్గజంగా కొనసాగుతున్న కోహ్లీ వికెట్ ఒకసారి తీస్తే ఇక అది తమ కెరియర్‌కి కీలక మలుపు అని అనుకుంటూ ఉంటారు. ఇక తనకు కూడా అలాంటి కోరిక ఉంది అంటే చెబుతున్నాడు సన్‌రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. ప్రస్తుతం సన్‌రైజర్స్ లో కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు ఉమ్రాన్ మాలిక్. మెరుపులాంటి బంతులు విసిరుతు బ్యాట్స్మెన్లను బెంబేలెత్తిస్తున్నాడు. అద్భుతమైన టెక్నిక్ తో వికెట్లు కూడా తీయటం చూస్తూనే ఉన్నాం. ఇటీవలే ఆలోచన మనసులో మాట బయట పెట్టాడు ఉమ్రాన్ మాలిక్.
ఇండియా మాజీ కెప్టెన్ ఆర్సిబి ఆటగాడు విరాట్ కోహ్లీని అవుట్ చేయడమే తన లక్ష్యం అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ చెప్పుకొచ్చాడు. తాను విరాట్ కోహ్లితో పాటు కేఎల్ రాహుల్ కి కూడా పెద్ద అభిమానిని అంటూ వెల్లడించాడు ఉమ్రాన్ మాలిక్. గత గేమ్ లో కేఎల్ రాహుల్ ని అవుట్ చేయాలని అనుకున్న.. కానీ అది కుదరలేదు. బెంగళూరు జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆడే సమయంలో విరాట్ బాయ్ ని అవుట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా అని అంటూ చెప్పుకొచ్చాడు ఉమ్రాన్ మాలిక్. ఈ యువ ఆటగాడు కోరిక తీరుతుందో లేదో మీరు చూడాలి మరీ..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి