ఆయా జట్ల లోని ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ జట్టుకు దూరమవుతూ ఉన్న నేపథ్యంలో అన్ సోల్డ్ గా ఐపీఎల్కు దూరంగా ఉన్న ఆటగాళ్లను మళ్లీ జట్టులోకి తీసుకుంటున్నాయి కొన్ని ఫ్రాంచైజీలు. ఈ క్రమంలోనే కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఆరోన్ ఫించ్ ని జట్టులోకి తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఇదే విషయం పై ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగా టోర్నీకి కోసం కోల్కతా ఫ్రాంచైజీ నుంచి పిలుపు రాగానే ఆనందంతో ఎగిరి గంతేసాను అంటూ చెబుతున్నాడు ఆరోన్ ఫించ్. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 1.5 కోట్లకు అతన్ని జట్టులోకి తీసుకుంది. అలెక్స్ హేల్స్ జట్టుకు దూరం అవడంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆరోన్ ఫించ్ ని కొనుగోలు చేసింది.
ఈ క్రమంలోనే స్పందించిన పించ్ ఇలాంటి ఉత్తమమైన పోటీ ఉండే టోర్నీలో ఆడటం గొప్పగా ఉంటుంది. ఈ లీగ్లో ఆడకపోతే మెగా టోర్ని ని చాలా మిస్ అవుతాను. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి సాధన చేయడం ఆడటం ద్వారా మరింత అనుభవం సాధిస్తాం. అందుకే వేలంలో అమ్ముడు పోకపోవడంతో ఎంతగానో నిరాశ చెందాను. కోల్కతా జట్టు నుంచి తనకు పిలుపు రాగానే సంతోషం లో మునిగిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు. తాను కోల్కతా జట్టు లోకి ఎంట్రీ ఇచ్చిన ఇటీవలే 14 బంతుల్లోనే అర్ధ శతకం చేసి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి