ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి వరకు పోరాటం సాగించినప్పటికీ చివరికి 11 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కాగా ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ లలో ఇది ఆరు ఓటమి కావడం గమనార్హం. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ కి ఇక ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతయ్యాయి అని చెప్పాలి. మరీ ముఖ్యంగా అటు కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించడమే కాదు ఒక స్టార్ ఆల్రౌండర్గా అద్భుతంగా రాణించాల్సిన రవీంద్ర జడేజా ప్రతి మ్యాచ్లో తేలిపోతు ఉన్నాడు అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడు ఒక మామూలు ఆటగాడిగా ఉంటేనే బాగా రాణించగలడు. కెప్టెన్సీ భారం అతడిపై స్పష్టంగా కనిపిస్తోంది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
కెప్టెన్సీ అప్పగించిన తర్వాత బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ లో కూడా రవీంద్ర జడేజా బాగా రాణించలేక పోతున్నాడు అంటూ నిరాశ చెందుతున్నారు అభిమానులు. ఇక దీనికి సంబంధించిన మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు మాత్రమే చేసి చివరికి ఓటమి చవి చూసింది అని చెప్పాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి