కానీ ఆఖరి నాలుగు ఓవర్ లలో చెన్నై ఆటగాళ్లు విఫలం అయ్యారు. ముఖ్యంగా జడేజా మరియు రాయుడు లు బ్యాట్ జులిపించలేకపోయారు. అయితే అప్పటి వరకు అద్భుతంగా ఫైట్ చేసిన రాయుడు అలసిపోయినట్లు కనిపించాడు. మరి జడేజాకు ఏమైంది అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అయితే ఈ ఒక్క మ్యాచ్ లోనే కాదు.. సీజన్ మొత్తంలో ఇప్పటి వర్కౌ జరిగిన మ్యాచ్ లను చూస్తే జడేజా బౌలింగ్ మరియు బ్యాటింగ్ రెండు విభాగాలలోనూ సమిష్టిగా విఫలం అయ్యాడు అని చెప్పాలి. నిన్న మ్యాచ్ లో అయితే లాస్ట్ ఓవర్ లలో ఓవర్ కు 13 కొట్టాల్సి ఉంది. కానీ మన కెప్టెన్ మాత్రం సింగిల్స్ తీస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక స్టార్ ప్లేయర్లు కూడా ఇలాగే ఆడితే ఫలితాలు ఎలా మారుతాయి. ఇక ఈ మ్యాచ్ లో ఓటమితో చెన్నై కూడా ప్లే ఆప్స్ నుండి తప్పుకోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పాలి. అసలు కెప్టెన్సీ జడేజాకు ఇవ్వకుండా ఉండాల్సింది అని చాలా మంది సీనియర్ లు అభిప్రాయపడుతున్నారు. ఇక చెన్నైకు మిగిలింది 6 గేమ్ లు మాత్రమే అన్నీ గెలిస్తే ఏమైనా అవకాశాలు ఉంటాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి