యంగ్ పేస్ గన్ ఉమ్రాన్ మాలిక్ ఒక్కడే 5 వికెట్లు తీసినా సన్ రైజర్స్ ఓటమిని ఆపలేకపోయారు. గుజరాత్ కు చివరి ఓవర్ సస్పెన్స్ ను తట్టుకుని గెలవడం కొత్తేమీ కాదు. అకాహారి ఓవర్ లో 22 పరుగులు చేయాల్సి ఉండగా తేవాతియా మరియు రషీద్ ఖాన్ లు సిక్సర్ లతో గుజరాత్ ను విజయతీరాలకు చేర్చారు. అయితే ఒక దశలో సన్ రైజర్స్ ఖచ్చితంగా గెలుస్తుందని భావించిన అభిమానుల అంచనాలను ఆ ఇద్దరూ తలక్రిందులు చేశారు. మాములుగా రషీద్ ఖాన్ మరియు రాహుల్ తేవాతియా లు బౌలింగ్ ఆల్ రౌండర్ లు... వీరు జట్టులో ఉండడానికి ప్రధాన ఉద్దేశ్యం అదే. కానీ ఇక్కడ పూర్తి వ్యతిరేకం అని చెప్పాలి.
ఒకవైపు రాహుల్ తేవాతియా కు అస్సలు ఒక్క ఓవర్ కూడా ఇవ్వడం లేదు. ఇక బౌలింగ్ చేస్తున్న రషీద్ ఖాన్ అయితే 4 ఓవర్ లకు వికెట్ లేకుండా 45 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఈ బౌలర్లు ఇద్దరూ కూడా ఒక హార్డ్ హిట్టర్స్ గా తామేమిటో ఈ సీజన్ లో ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ ల వరకు వీరిద్దరి వల్ల గెలిచింది గుజరాత్. అన్నీ కూడా ఉత్కంఠ మ్యాచ్ లే... లాస్ట్ ఓవర్ ఫినిషింగ్ లే కావడం గమనార్హం. బౌలింగ్ లో ఫైలు అయితే ఏమి బ్యాటింగ్ లో చెలరేగి తమ జట్టుకు అద్బుతమయిన విజయాలను అందిస్తున్నారు ఈ ఆల్ రౌండర్ లు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి