ఐపీఎల్ సీజన్ 15 ఆసక్తికరంగా సాగుతోంది. తొలిసారిగా టోర్నీలో అడుగు పెట్టిన రెండు జట్లు గుజరాత్ టైటాన్స్ మరియు లక్నో సూపర్ జాయింట్స్ లు అద్భుతంగా రాణిస్తున్నాయి. ఈ రెండు జట్లను ముంబై మాజీ అల్ రౌండర్ హార్దిక్ పాండ్య మరియు పంజాబ్ మాజీ కెప్టెన్ రాహుల్ లు తమ నాయకత్వంతో సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. లీగ్ మ్యాచ్ లు సగానికి పైగా పూర్తయిన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు ప్లే ఆఫ్ కు చేరుకునే జట్లు ఏవో అంటూ చర్చ జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయా హాట్లు చేసిన ప్రదర్శనను ఆధారంగా చేసుకుని ఈ నాలుగు జట్లు ప్లే ఆఫ్ కు చేరుతాయని ఊహిస్తున్నారు.

గుజరాత్ టైటాన్స్

వాటిలో ముందుగా గుజరాత్ టైటాన్స్ పేరు వినబడుతోంది. ఈ జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్య ఉన్నారు. మొదటి నుండి ప్రతి మ్యాచ్ ను ఎంతో సీరియస్ గా తీసుకుంటూ గెలుచుకుంటూ వస్తోంది. సీజన్ ఆరంభంలో ఒక్క మ్యాచ్ లో మాత్రమే ఓటమి చెందింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్ తాను ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో ఎనిమిదియు గెలిచి 16 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. స్థానం ఏది అనేది అటుంచితే ప్లే ఆప్స్ కు ఖచ్చితంగా చేరుకుంటుంది.

రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ మొదటి సీజన్ లోనే టైటిల్ ను కొట్టి సంచలనం సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ రెండవసారి టైటిల్ ను కొట్టడానికి గత 14 సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. ఈహతే ప్రతిసారి సరైన ప్రదర్శన కనబరుస్తూనే ఉన్నా ఎందుకో కీలక సమయంలో తడబడుతూ ప్లే ఆప్స్ లో ఓటమితో వెనుతిరుగుతోంది. అయితే ఈ సారి శాంసన్ సేన దూకుడు చూస్తుంటే టైటిల్ గెలిచే రేస్ లో ఉన్నట్టే అనిపిస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో తొమ్మిది మ్యాచ్ లలో ఆరు మ్యాచ్ లలో గెలిచి పన్నెండు పాయింట్లతో మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు కూడా ప్లే ఆప్స్ లో ఉంటుంది.

లక్నో సూపర్ జాయింట్స్

పంజాబ్ నుండి వచ్చేసి లక్నో సూపర్ జాయింట్స్ కు కెప్టెన్ అయిన కెఎల్ రాహుల్ తన కొత్త జట్టును సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకు వెళుతున్నాడు. ఇప్పటి వరకు లక్నో 10 మ్యాచ్ లలో 7 గెలిచి 14 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. సంచలనాలు ఏమీ నమోదు కాకుంటే ఈ టీమ్ కూడా ప్లే ఆప్స్ చేరడం పక్కా అని తెలుస్తోంది.

ఇక మిగిలిన నాలుగవ స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. అయితే అర్హత మాత్రం ఖచ్చితంగా ఢిల్లీకి ఉందని చెప్పాలి. అయితే ఈ మధ్య జరిగిన మ్యాచ్ లను చేతులారా పోగొట్టుకుని ఓటమి చెందుతోంది. ఇక బెంగుళూరు మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ లు సైతం ప్లే ఆప్స్ రేస్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: