ఇప్పటికే భారత క్రికెట్లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న మహేంద్రసింగ్ ధోని దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఇక క్రికెట్ ను ప్రొఫెషనల్గా ఎంచుకోవడానికి ఎంతో మంది యువ ఆటగాళ్లకు మహేంద్ర సింగ్ ధోనీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ధోని క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని చెప్పాలి. ఇప్పుడు వరకు కీపర్గా, ఫినిషర్ గా అంతకు మించి ఒక కెప్టెన్ గా ధోని అరుదైన రికార్డులు సృష్టించిన మహేంద్ర సింగ్ ధోనీ మరో అరుదైన రికార్డు అడుగుల దూరంలో ఉన్నాడు.



  అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్రసింగ్ ధోని జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉండడంతో మళ్ళీ సారథ్య బాధ్యతలను చేపట్టాడు. ఇటీవల హైదరాబాదు జట్టుతో జరిగిన మ్యాచ్లో ధోనీ కెప్టెన్సీలోనే చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడం గమనార్హం. కాగా ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన మహేంద్ర సింగ్ ధోనీని ఇక ఇప్పుడు మరో రికార్డు ఊరిస్తోంది. మరో 6 పరుగులు చేస్తే చాలు ఒక అరుదైన మైలురాయిని అందుకో బోతున్నాడు మహేంద్రసింగ్ ధోని.



 ప్రస్తుతం భారత క్రికెట్లో టి20లో ఆరు వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక కెప్టెన్ గా  కొనసాగుతూ ఉన్నాడు విరాట్ కోహ్లీ. అయితే మరో ఆరు పరుగులు చేశాడు అంటే మహేంద్ర సింగ్ ధోనీ కూడా టి 20 లలో 6 వేల పరుగుల మైలురాయిని అందుకోబోతున్నారు అనే చెప్పాలి. ఆరు వేల పరుగులు చేసిన రెండో కెప్టెన్  గా రికార్డు సృష్టించబోతున్నాడు ధోనీ. ఇప్పటి వరకు 185 ఇన్నింగ్స్ లో 5994  పరుగులు చేశాడు  ధోని. ఇందులో 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్లో ధోనీ ఈ ఘనత సాధించే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: