ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ ఆటగాడు విరాట్ కోహ్లీ పేలవమైన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు రికార్డులను కొల్లగొట్టి పరుగుల యంత్రం గా పేరు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ.. ఇప్పుడు కనీసం పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. పరుగులు చేయడం కాదు కదా ప్రతి మ్యాచ్లో కూడా డకౌట్ గా వెను తిరుగుతూ అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తూనే ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే గత రెండు మూడు మ్యాచ్ల నుంచి వరుసగా డక్ ఔట్ అవుతు ఉన్నాడు విరాట్ కోహ్లీ. దీంతో అభిమానులు ఏకంగా విరాట్ కోహ్లీ ఆట తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడిన మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ మరోసారి నిరాశ పరిచాడు. ఈసారి విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేయడం ఖాయం అనుకుంటున్న సమయంలో క్రీజులోకి వచ్చిన మొదటి బంతికి డక్ ఔట్ అయి మళ్లీ అంతలోనే పెవిలియన్ వెళ్ళిపోయాడు. సన్రైజర్స్ బౌలర్ జగదీశ సుజిత్ వేసిన మొదటి బంతికే విరాట్ కోహ్లీ అవుట్ కావడంతో అందరూ నిరాశలో మునిగి పోయారు అని చెప్పాలి. దీంతో ఒక్క పరుగు కూడా చేయకుండానే బెంగళూరు జట్టు ఒక వికెట్ కోల్పోయింది.



 ఈ క్రమంలోనే డకౌట్ కాగానే విరాట్ కోహ్లీ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. నిరాశ  కోపంతో కూడిన చిరునవ్వుతో మైదానం వీడాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీ పరిస్థితిని అర్థం చేసుకున్న ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్. డ్రెస్సింగ్ రూమ్ లో అతడిని ఓదార్చడం గమనార్హం. భుజం తట్టి తల నిమురుతూ మరేం పర్లేదు అన్నట్లుగా ఊరట కలిగించాడు. సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో అభిమానులను తెగ ఆకర్షిస్తుంది. ఇక ఈ వీడియో చూసిన తర్వాత కోచ్ అంటే ఇలా ఉండాలి అంటూ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పై కోహ్లీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: