ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ప్రస్తుతం ఎంతో మంది యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారూ అన్నది అందరికీ తెలిసిందే. ఎవరి ప్రదర్శన ఎలా ఉండబోతుందో అన్నది కూడా అటు ప్రేక్షకుల ఊహకందని విధంగానే ఉంది. ఈ క్రమంలోనే  భారత యువ ఆటగాళ్లు మాత్రమే కాదు అటు విదేశీ ఆటగాళ్లు సైతం అదరగొడుతున్నారు. మొన్నటి వరకు ఎవరికీ తెలియని ఆటగాళ్లు ఇక ఇప్పుడూ అద్భుతమైన ప్రదర్శన తో అందరికీ సుపరిచితులు గా మారిపోతున్నారు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లో పవర్ హిట్టర్ రోవ్మన్ పావెల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా పరుగుల వరద పారిస్తూ ఢిల్లీ విజయంలో కీలక పాత్ర వహిస్తున్న విషయం తెలిసిందే.


 ఆరంభ మ్యాచ్లో ఘోరంగా విఫలమైన రోవ్మన్ పావెల్ తర్వాత మాత్రం తన హిట్టింగ్ తో జట్టుకు అద్భుతమైన విజయాలను అందిస్తూ వస్తున్నాడు. ఇక భారీ పరుగులు చేస్తూ ఎప్పుడు జట్టుకు మంచి స్కోరు అందిస్తూ ఉన్నాడు రోవ్మన్ పావెల్. దీంతో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు అతనె మొదటి టార్గెట్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇక్కడ  ఈ విదేశీ ఆటగాడు ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ పాడ్కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. నేను జమైకా లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. మా గ్రామంలో చాలా కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన ఆదాయం అంటూ చెప్పుకొచ్చాడు.


 నాకు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే మక్కువ పెరిగిపోయింది. క్రికెట్ బాగా ఆడి నా కుటుంబాన్ని పేదరికం ముందు బయట పడేయాలని ఎన్నో కళలు కూడా కన్నాను.  ఒకవేళ నేను ప్రొఫెషనల్ క్రికెటర్ కాకపోయి ఉంటే ఇక సైనికుడునీ అయ్యేవాడిని అంటు రోమన్ పావెల్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో 11  మ్యాచులు ఆడిన పావెల్ 207 పరుగులు చేశాడు. ఇక ఇందులో ఒక అర్థ సెంచరీ కూడా ఉండడం గమనార్హం. అయితే చేసింది తక్కువ పరుగులు అయినప్పటికీ కీలకమైన సమయంలో ఈ పరుగులు చేయడంతో పాటు ఢిల్లీక్యాపిటల్ జట్టుకు ఈ పరుగులు ఎంతగానో ఉపయోగపడ్డాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl