కరోనా వైరస్ కారణంగా కఠిన నిబంధనల మధ్య ప్రస్తుతం బిసిసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని జట్ల ఆటగాళ్లు కేవలం ఒకే ఒక హోటల్ రూం కి పరిమితం అయి క్వారంటైన్ లో ఉంటూ వరుసగా మ్యాచ్ లలో హోరాహోరీగా తలపడుతున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఆటగాళ్లు మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు ఆయా ఫ్రాంచైజీలు వివిధ ఆసక్తికర సరదా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆటగాళ్లతో ఫన్నీ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఇలాంటి ఒక వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్రస్తుతం కీలక బౌలర్ గా కొనసాగుతున్న ట్రెంట్ బౌల్ట్ పై ఆ జట్టు ఆటగాళ్లు ఫ్రాంక్ చేశారు. వీడియో ని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో పంచుకుంది. రాజస్థాన్ సోషల్ మీడియా విభాగం ట్రెంట్ బౌల్ట్ ని ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా అక్కడ ఒక వాతావరణాన్ని సృష్టించారు. ఈ క్రమంలోనే కెమెరాలు పెట్టి సోషల్ మీడియా విభాగం సభ్యుడితో ట్రెంట్ బౌల్ట్ ని ఇంటర్వ్యూ చేయించారు. ఈ విషయం తెలియని ట్రెంట్ బౌల్ట్ అక్కడ జరుగుతుంది నిజమైన ఇంటర్వ్యూ అని అనుకున్నాడు.


 ఈ క్రమంలోనే ట్రెంట్ బౌల్ట్ ఎలాంటి ప్రశ్నలు వేయాలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి డ్రెస్సింగ్ రూమ్ లోపలి నుంచి ఫోన్లో రియాన్ పరాగ్ సూచిస్తూ ఉంటే వాటిని హెడ్ ఫోన్ లో వింటూ తానే స్వయంగా అడుగుతున్నట్లు నటించాడు సోషల్ మీడియా విభాగం సభ్యుడు.  మీ గురించి హిందీలో చెప్పండి. ఓ బాలీవుడ్ డైలాగ్ వినిపించండి.. మీ కొత్త సారథి బెన్ స్టోక్స్ పై మీ అభిప్రాయం ఏంటి.. మీరు వేసుకుంది మిచెల్ టీ షర్ట పొడుగ్గా ఉంది అంటూ చిరాకు తెప్పించే ప్రశ్నలు వేశాడు.  అయినప్పటికీ ట్రెంట్ బౌల్ట్  మాత్రం ఎంతో ఓపికగా సమాధానం చెప్పేందుకు ప్రయత్నించాడు. ఇక ఆ తర్వాత ముగ్గురు ఆటగాళ్లు వచ్చి ఇది ఫ్రాంక్ అంటూ నిజాన్ని బయటపెట్టిన నవ్వుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: