ఐపిఎల్ సీజన్ 15 లో ఆఖరి మ్యాచ్ పూర్తి అయ్యే వరకు ప్లే ఆఫ్ లో అన్ని ఏవో తెలిసేలా లేవు. ఎందుకంటే జరుగుతున్న ఒక్కో మ్యాచ్ ఉత్కంఠగా జరుగుతూ ప్రేక్షకులకు ఎంతో థ్రిల్ ను కలిగిస్తోంది. గత వారం వరకు ప్లే ఆఫ్ పై అంచనాలు ఒక విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్లే ఆఫ్ కు ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానంలో ఉండగా, మిగిలిన మూడు స్థానాల కోసం పోటీ జరుగుతోంది. అయితే ఇందులో రెండవ జట్టుగా లక్నో ప్లే ఆఫ్ కు చేరుకుంటుందని అంతా భావించారు . కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయిపోయింది. గత మ్యాచ్ లో రాజస్థాన్ తో లక్నో ఓటమి పాలు కావడం చాలా నష్టాన్ని కలిగిస్తోంది.

ఇక లక్నో కు మిగింది ఒక మ్యాచ్ కాగా అది కూడా కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది. ప్రస్తుతం లక్నో ౧౬ పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. ఆఖరి మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోల్కతా కనుక భారీ తేడాతో గెలిస్తే రన్ రేట్ దారుణంగా పడిపోతుంది. తనకన్నా మెరుగ్గా రన్ రేట్ ఉండే జట్టు ఏదైనా ప్లే ఆఫ్ కు చేరే ఛాన్సెస్ ఉన్నాయి . ప్రస్తుతం వరకు చూసుకుంటే కోల్కతా, పంజాబ్ మరియు సన్ రైజర్స్ కు ఉన్న మ్యాచ్ లు గెలిచినా 16 పాయింట్లు రావు. కాబట్టి బెంగుళూరు, ఢిల్లీ మరియు లక్నో లలో ఏ రెండు జట్లు అయినా ప్లే ఆఫ్ కు చేరవచ్చు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అలా కాకుండా బెంగుళూరు తన లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోతే లక్నో మరియు ఢిల్లీ లు ప్లే ఆఫ్ కు వెళ్తాయి. ఎటు చూసినా లక్నో కోల్కతా తో మ్యాచ్ గెలవక తప్పదు. అప్పుడే కొంచెం టెన్షన్ తగ్గుతుంది. మరి అప్పుడు బెంగుళూరు గుజరాత్ తో ఓడిపోతే లక్నో కు లైన్ క్లియర్ అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: