గత కొంత కాలం నుంచి టీమిండియా సీనియర్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా ఏదో ఒక విషయం పై వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. గతం లో ఒక జర్నలిస్టు తనను ఇంటర్వ్యూ ఇవ్వక పోతే బెదిరించాడు అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు వృద్ధిమాన్ సాహా. ఇక ఇప్పుడు ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న వృద్ధిమాన్ సాహా ప్రతి మ్యాచ్ లో కూడా బాగా పరుగులు చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 కేవలం టెస్ట్ ఫార్మేట్ కి మాత్రమే వృద్ధిమాన్ సాహా ఆటతీరు సెట్ అవుతుంది అని విమర్శలు చేసిన ప్రతి ఒక్కరీ నోళ్ళు మూయిస్తున్నాడు  ఈ ఆటగాడు. ఈ క్రమం లోనే వృద్ధిమాన్ సాహా ప్రస్తుతం ప్రతి మ్యాచ్లో చేస్తున్న ప్రదర్శనపై మాజీ ఆటగాళ్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు  అయితే అతను బాగా ఆడుతున్న ప్పటికీ ఎందుకో వార్తల్లో మాత్రం ఎక్కువగా కనిపించడం లేదు. అతని గురించి ఎవరూ పట్టించు కోవడం కూడా లేదు. ఈ క్రమం లోనే ఇదే విషయం పై ఇటీవలే ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో వృద్ధిమాన్ సాహా గుర్తింపు దక్కని ప్లేయర్ అంటూ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. స్పిన్, ఫేస్ తో సంబంధం లేకుండా ఎలాంటి బౌలింగ్ నైనా సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టగల ప్రతిభావంతుడు వృద్ధిమాన్ సాహా అంటూ చెప్పుకొచ్చాడు. ఈక్రమం లోనే వృద్ధిమాన్ సాహా కు ఎక్కువగా ఆడేందుకు అవకాశాలు ఇవ్వాలి అంటూ సూచించాడు మాస్టర్ బ్లాస్టర్. కాగా ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున 9 మ్యాచ్లు ఆడిన వృద్ధిమాన్ సాహా 312 పరుగులు చేసి అదరగొట్టాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl