ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఢిల్లీ జట్టు పేలవ ప్రదర్శన అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎంతగానో కలిసివచ్చింది. ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ జట్టు ఓటమి పాలు కావడంతో అటు  బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి. దీంతో అటు ఆర్సిబి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. అయితే అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ విజయం సాధించడంలో టిమ్ డేవిడ్ కీలక పాత్ర వహించాడు.


ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న టిమ్ డేవిడ్ ఇక ఇటీవలే మెరుపు ఇన్నింగ్స్ ఆడి అటు ముంబై ఇండియన్స్ జట్టును విజయతీరాలకు చేర్చాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ఏకంగా 11 బంతుల్లో నాలుగు సిక్సర్లు రెండు ఫోర్లు కొట్టి 34 పరుగులు చేశాడు. ఇలా ముంబై ఇండియన్స్ ని టీమ్ డేవిడ్ గెలిపించడం కారణంగానే అటు బెంగుళూరు జట్టు ప్లే ఆఫ్ లో అవకాశం దక్కించుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది అన్న విషయం తెలిసిందే. అయితే టీమ్ డేవిడ్ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు. కానీ ఇప్పుడు మాత్రం ముంబైలో కొనసాగుతున్నాడు.


 ఇలా ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పటికీ అతను  బెంగళూరు జట్టుకు ఎంతో మేలు చేశాడు అంటు సోషల్ మీడియా వేదికగా బెంగళూరు అభిమానులందరూ కూడా పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే అతన్ని ముంబై ఇండియన్స్ జట్టు మెగా వేలంలో  8.25 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బెంగళూరు జట్టును ప్లే ఆప్ లో చేరే విధంగా ముంబై ఇండియన్స్ ను గెలిపించిన టీమ్ డేవిడ్  కి బెంగుళూరు జట్టు కెప్టెన్ డూప్లేసెస్  ఒక అపురూప కానుక పంపించాడు అని చెప్పాలి. తనతో పాటు విరాట్ కోహ్లీ మ్యాక్స్ వెల్ ముంబై కిట్ లో ఉన్న ఒక ఫోటో ని డేవిడ్ కి పంపించాడు. ఈ విషయాన్ని డేవిడ్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: