ఐపీఎల్ ఆరంభంలో ఎంతో పటిష్టంగా కనిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆ తరువాత మాత్రం వరుస పరాజయాలతో సతమతమవుతున్న  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బెంగుళూరు విజయంతో పాటు ఇతర జట్ల పరాజయాల పై ఆ జట్టు భవిష్యత్ ఆధారపడి అతికష్టం మీద ప్లే ఆప్ ని అర్హత సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఇటీవలే ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి కారణంగానే అటు బెంగళూరుకు కలిసి వచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఈ క్రమంలోనే అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక అరుదైన రికార్డును సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా రికార్డు సృష్టించింది  ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 11 సార్లు, ముంబై ఇండియన్స్ తొమ్మిదిసార్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తే అటు రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు జట్టు ఎనిమిది సార్లు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన జట్టుగా రికార్డు సృష్టించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సమానంగా అటు  హైదరాబాద్ జట్టు కూడా ఎనిమిది సార్లు ప్లే ఆఫ్ సాధించడం గమనార్హం. కాగా ఐపీఎల్లో ఎక్కువ సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్రైడర్స్ జట్టు ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ దశలోనే నిష్క్రమించాయి అన్న విషయం తెలిసిందే.


కాగా ప్లే ఆఫ్ లో అడుగు పెట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో మూడవ స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడబోతుంది. ఇందులో విజయం సాధిస్తే ఇక రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. అక్కడ కూడా గెలిస్తే ఫైనల్కు చేరుకుంటుంది. అయితే చరిత్రలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన జట్లు టైటిల్ నెగ్గడం ఒకే ఒకసారి జరిగింది. 2016 సీజన్లో మూడో స్థానంలో నిలిచింది సన్రైజర్స్ కేకేఆర్ ను ఓడించి రెండో క్వాలిఫయర్లో గుజరాత్ ను ఓడించి ఫైనల్ చేరింది. ఫైనల్లో ఆర్సిబి ని మట్టికరిపించి టైటిల్ సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb