భారత క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా గుర్తింపు సంపాదించుకున్నాడు చెటేశ్వర్ పుజారా  భారత టెస్టు జట్టుకు నయా వాల్ అంటూ గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు. ఎంతో ఆచితూచి ఆడుతూ భారీ పరుగులు చేయడంతో ఛటేశ్వర్ పుజారా ఎప్పుడు ముందుంటాడు అనే చెప్పాలి. ఇలా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా పేరు సంపాదించుకుని వన్డే టి20 లకు పూర్తిగా దూరం అయిపోయాడు. అయితే ఇక చటేశ్వర్ పుజారా కాస్త గత కొంత కాలం నుంచి ఫామ్ ను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు.


 బీసీసీఐ అతనికి ఎన్ని అవకాశాలు కల్పించిన నిరూపించుకో లేకపోయాడు. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. చటేశ్వర్  పుజారా ఫామ్ కోల్పోవడం అటు టీమిండియాకు మైనస్ గా మారుతుందని అతని పక్కన పెట్టడం బెటర్ అంటూ డిమాండ్ తెర మీదికి వచ్చాయి. దీంతో ఇండియా నుంచి అతన్ని తప్పించారు సెలెక్టర్లు. రంజీ మ్యాచ్ లు ఆడి మళ్లీ ఫామ్ సాధించాలి అని సూచించారు. అయితే ఇటీవలే కౌంటిల్లో ఆడుతున్న చటేశ్వర్ పుజారా వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమం లోనే సెలెక్టర్లు చూపును ఆకర్షించాడు. గత ఏడాది ఇంగ్లండ్తో వాయిదా పడిన ఐదవ టెస్ట్ మ్యాచ్ తో పాటు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు సంబంధించిన జట్లను ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. టెస్ట్ సిరీస్లో సీనియర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ జస్ప్రిత్ బుమ్రా లకు విశ్రాంతి ఇచ్చింది బిసిసీఐ. ఇక సీనియర్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పుజారా టెస్ట్ జట్టు లోకి తీసుకోవడం గమనార్హం. దీంతో అభిమానులు అందరూ కూడా ఆనందం లో మునిగి పోయారు. ఇప్పటికే ఫుల్ ఫామ్ లో ఉన్న  పూజారా ఇప్పుడు టీమ్ ఇండియా తరఫున కూడా వరుస సెంచరీ తో అదరగొట్ట పోతున్నాడు అంటూసోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి: