అతని కెరీర్ ముగిసిపోయింది. ఇక నేటి రోజుల్లో పోటీని తట్టుకుని అతను టీమిండియా లోకి రావడం కష్టమే.. అతను రిటైర్మెంట్ ప్రకటిస్తే బెటర్ అని విమర్శలు  ఎదుర్కొనే స్థాయినుంచి ఇక ఇప్పుడు అతను టీమిండియాలో ఉంటే బాగుంటుంది అని ప్రతి ఒక్కరూ ప్రశంసించే స్థాయికి ఎదిగాడు. అతను ఎవరో కాదు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్. ప్రస్తుతం భారత క్రికెట్లో మోస్ట్ సీనియర్ గా కొనసాగుతున్న దినేష్ కార్తీక్ ఇండియా జట్టుకు దూరమై చాలా రోజులు అయింది. కానీ ఇటీవల ఐపిఎల్ లో మాత్రం ఫుల్ ఫామ్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.


 ప్రతి మ్యాచ్లో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ తనలో దాగివున్న ఫినిషెర్ ను బయటపెట్టాడు. దీంతో సెలక్టర్ల చూపులు ఆకర్షించాడు. ఇక ఇటీవల దక్షిణాఫ్రికాతో ఇండియా ఆడబోయే  టి20 సిరీస్  కోసం దినేష్ కార్తీక్ సెలెక్ట్ అయ్యాడు అనే విషయం తెలుస్తుంది  ఇక ఎన్నో ఏళ్ల తర్వాత ఈ సీనియర్ క్రికెటర్ కి మళ్ళీ టీమిండియాలో అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు దినేష్ కార్తీక్. మనపై మనకు విశ్వాసం ఉన్నప్పుడు ప్రతిది మన అనుకున్నట్లుగానే జరుగుతూ ఉంటుంది.. కష్టకాలంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు.  నాపై నమ్మకం ఉంచి మరో అవకాశం ఇచ్చిన సెలక్టర్ల కు కృతజ్ఞతలు.. హార్డ్ వర్క్ ను అలాగే కంటిన్యూ చేస్తాను అంటూ తన ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టాడు దినేష్ కార్తీక్.


 ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన దినేష్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. 14 మ్యాచుల్లో వేగంగా 283 పరుగులు చేశాడు. చివరి లో వచ్చి అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చి ఒంటిచేత్తో గెలిపించాడు దినేష్ కార్తీక్. దీంతో అందరూ అనుకున్నట్టుగానే అతనికి టీమిండియాలో అవకాశం దక్కింది అని చెప్పాలి. దీంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు..

మరింత సమాచారం తెలుసుకోండి: