ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే సిక్సర్ల మోత మోగిపోతుంది అన్న విషయం తెలిసిందే. బౌలర్ ఎవరైనా సరే ఇక క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ మాత్రం సిక్సర్లు ఫోర్లతో  విరుచుకుపడుతూ ఉంటారూ. ముఖ్యంగా ఎంతో అలవోకగా భారీ సిక్సర్లు కొట్టటమే ఐపీఎల్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. బ్యాట్స్మెన్లు  ఇలా సిక్సర్లు కొడుతుంటే మైదానంలో ఉన్న జట్టు అభిమానులు అందరూ కూడా డ్యాన్సులు చేస్తూ తెగ ఆనంద పడిపోతూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు.


 ఈ క్రమంలో అటు ఐపీఎల్ నిర్వాహకులు మాత్రం ఐపీఎల్ సీజన్ లో ఎన్ని సిక్సర్లు నమోదవుతున్నాయి అన్న విషయాలు ఎప్పటికప్పుడు లెక్కించు కుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే   అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఎంతో అద్భుతంగా సాగింది. ఇటీవలే లీగ్ మ్యాచ్లు ముగియడంతో మరికొన్ని రోజుల్లో ప్లేఆఫ్ ప్రారంభం కాబోతోంది. 2022 ఐపీఎల్ సీజన్ ఒక ప్రత్యేకత దక్కించుకుంది. ఒక సీజన్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన రికార్డును 15 సీజన్ సొంతం చేసుకోవడం గమనార్హం. ఇటీవలే పంజాబ్ సన్రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో లివింగ్ స్టోన్ కొట్టిన సిక్సర్ తో 1000 సిక్సర్లు  పూర్తిచేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక సిక్సర్లు నమోదు కావడం గమనార్హం.


 2018 సీజన్ లో నమోదైన 872 సిక్సర్లు ఈ సీజన్ ముందు వరకు అత్యధిక సిక్సర్లు గా కొనసాగాయి. ఇప్పుడు మాత్రం ఆ రికార్డు బద్దలయింది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్ లు సెమీ ఫైనల్ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్ లను మరో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. దీంతో ఇంకా ఎన్ని సిక్సర్లు  నమోదు అవుతాయి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 2009లో 506 సిక్సర్లు  ఐపీఎల్ లో అత్యల్పం  కావడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో లివింగ్ స్టోన్ 117 మీటర్లు సిక్సర్ కొట్టగా.. ఇదే అతి పెద్ద సిక్స్  గా కొనసాగుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl