మహిళల క్రికెట్ ను ప్రోత్సహించేందుకు బిసిసిఐ ముందడుగు వేసింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ తరహాలో ఉమెన్స్ టి20 చాలెంజ్ అనే లీగ్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లుగా వాయిదాపడిన ఈ టోర్నీ ఇక ఈ ఏడాది మాత్రం వైరస్ ప్రభావం తగ్గడంతో జరిగింది. ఈ క్రమంలోనే ఈ టోర్నీలో ఏకంగా మూడు జట్లు పాల్గొన్నాయి. ఇక ఎంతో హోరాహోరీగా జరిగిన మ్యాచుల్లో నిన్న హర్మన్ ప్రీత్ సారథ్యంలోని సూపర్ నోవాస్.. దీప్తి శర్మ సారథ్యంలోని వెలాసిటీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికి రెండు సార్లు ఉమెన్స్ టి20 ఛాలెంజ్ కప్ గెలుచుకుని రికార్డు సృష్టించింది హర్మన్ ప్రీత్  సూపర్నోవాస్ జట్టు.


 ఈ క్రమంలోనే ఈ సారి కొత్త జట్టు ఛాంపియన్ గా అవతరిస్తుందని క్రికెట్ ప్రేక్షకులు అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధించి విజయం అందుకోబోతున్నారు అన్నది తెలుసుకోవడానికి ఆసక్తిగా వీక్షించారు. కాగా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో చివరికి దీప్తి శర్మ జట్టుకు నిరాశ ఎదురైంది. నాలుగు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే హర్మన్ ప్రీత్ జట్టు మూడో సారి టైటిల్ను కైవసం చేసుకోవడం గమనార్హం. ఉమెన్స్ టి20 ఛాలెంజ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసింది హర్మన్ ప్రీత్  సూపర్నోవాస్ జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.


 ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన దీప్తి శర్మ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. చివరికి రన్నరప్ తో సరిపెట్టుకుంది. కాగా ఇప్పటికే హర్మన్ప్రీత్ సారథ్యంలోని సూపర్నోవాస్ జట్టు 2018,2019  సంవత్సరాల్లో టి 20 ఛాలెంజ్ టైటిల్ను కైవసం చేసుకుంది అనే చెప్పాలి. ఇదిలా ఉంటే నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే.  గుజరాత్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధించి ఛాంపియన్అవతరించి పోతున్నాను అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ..

మరింత సమాచారం తెలుసుకోండి: