విరాట్ కోహ్లీ గత కొంతకాలం నుంచి పేలవ ఫాంలో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అటు టీమిండియా తరఫున కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కూడా తన ప్రదర్శనతో నిరాశ పరుస్తూనే ఉన్నాడు.  వరల్డ్ క్లాస్ ప్లేయర్  గా గుర్తింపు సంపాదించుకున్న కోహ్లీ నుంచి ఇలాంటి ప్రదర్శన  అభిమానులు మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అనే చెప్పాలి.  ఇలాంటి నేపథ్యంలో కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ సారథి మైకెల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 విరాట్ కోహ్లీ దిగ్గజ ఆటగాడు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. మూడేళ్ల క్రితం బరిలోకి దిగితే శతకం సాధిస్తాడు అని అనుకునే వాళ్ళం.. అంత గొప్ప స్థాయిలో అతని ప్రదర్శన ఉండేది. కెరీర్ మొత్తం ఒకేలా తేలిగ్గా పరుగులు సాధించడం ఎవరివల్లా కాదు.  ఇప్పుడు కోహ్లీ ఇబ్బందులు పడుతున్నాడు. కొన్నాళ్ల పాటు విరామం కావాలి.. కొన్నాళ్ళు కుటుంబంతో హాయిగా ఉంటూ ఒత్తిడిని జయించిన తర్వాత ఇంగ్లాండ్ కు వెళ్లి రావాలి. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న కష్టపడితే మళ్ళీ ఫామ్ అందుకుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు.


 ఇక కోహ్లీ పేలవమైన ఫాంపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ స్పందిస్తూ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటే బెటర్ పరుగులు లేకపోతే తాను కూడా బాధపడతానని కోహ్లీ అన్నాడు. ఒక విషయం ఏంటంటే కోహ్లీ పరుగులు చేసి నప్పుడు ఆ జట్టు బాగా ఆడుతుంది. అతను ఆడకపోతే జట్టు కూడా విఫలమవుతోంది. 2016 లో అత్యధిక పరుగులు చేసిన ప్పుడు బెంగళూరు అద్భుతంగా ప్రదర్శన చేసింది. కోహ్లీ ఒక గొప్ప ఆటగాడు అయినా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. విశ్రాంతి తీసుకొని లోపాలను అధిగమించి మళ్లీ తిరిగి వస్తే  బెటర్ అంటూ బ్రెట్ లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: