ఇంగ్లండ్ వేదికగా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల 277 పరుగులు టార్గెట్ తోచే బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 69 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఇక జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. గ్రాండ్ హోమ్ వేసిన 27 ఓవర్ నాలుగో బంతికి బెన్ స్టోక్స్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి చివరికి బౌల్డ్ అయ్యాడు. దీంతో కీలక వికెట్లు పడగొట్టామూ అని న్యూజిలాండ్ ఆటగాళ్లు అందరూ సంబరాల్లో మునిగిపోయారు. బెన్ స్టోక్స్ కూడా తనలో తాను మాట్లాడుకుంటూ నిరాశగా పెవిలియన్ వైపు వెళ్ళిపోయాడు. అంతలో ఎవరు ఊహించని ట్విస్ట్.
అది నో బాల్ అంటూ టీవీ అంపైర్ ఆన్ ఫీల్డ్ అంపైర్ కి తెలియజేశాడు. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ వెంటనే బెన్ స్టోక్స్ ను వెనక్కి పిలిచాడు. నో బాల్ అంటూ ప్రకటించాడు. దీంతో పెవిలియన్ వైపు నిరాశగా వెళ్తున్న బెన్ స్టోక్స్ మళ్లీ యూటర్న్ తీసుకుని క్రీజులోకి వచ్చాడు. అయితే జూన్ 4వ తేదీన బెన్ స్టోక్స్ బర్త్ డే కావడం గమనార్హం. తనబర్త్ డే రోజే అంపైర్ ఇలాంటి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి