ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ ఆశించిన మేర రాణించలేకపోయాడు అనే విషయం తెలిసిందే. కొన్ని మ్యాచ్ లలో మంచి బ్యాటింగ్ తో ఆకట్టుకున్నప్పటికీ ఎక్కువ మ్యాచ్ లలో మాత్రం తక్కువ పరుగులు చేసి నిరాశపరిచాడు అని చెప్పాలి. అయినప్పటికీ టీమిండియాలో అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ ఇక ఇటీవల జరిగిన మొదటి మ్యాచ్లో మరోసారి అదరగొట్టాడు. కేవలం 48 బంతుల్లోనే 75 పరుగులు చేసి మెరుగైన ప్రదర్శన కనబరిచాడు ఇషాన్ కిషన్. మొదట్లో తడబడినట్లు కనిపించినా ఆ తర్వాత మాత్రం అద్భుతంగా పుంజుకున్నాడు.



 ఇక అంతకుముందు కూడా ఓపెనర్గా ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించడంతో అతను టీమిండియాకు ఓపెనర్గా సరిగ్గా సరిపోతాడని.. ఓపెనర్ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు రోహిత్ శర్మ కె.ఎల్.రాహుల్ ఇలాంటి ఆటగాళ్లను  తమ స్థానాలను మార్చుకోవాలి అంటూ ఇషాన్ కిషన్ అడిగితే బాగుంటుందని పలువురు సూచనలు కూడా చేశారు. అయితే ఇదే విషయంపై ఇటీవలే మాట్లాడిన ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా కె.ఎల్.రాహుల్ కెప్టెన్ రోహిత్ శర్మ రాణిస్తున్నారు. వారిద్దరూ కూడా వరల్డ్ క్లాస్ బ్యాట్స్ మెన్లు.


 ఇక వాళ్ళు జట్టులో కొనసాగుతున్నప్పుడు నా కోసం వాళ్ళు స్థానాలు మార్చుకోవాలని నేను అడగలేను. అది మంచిది కాదు. నా పని కేవలం ప్రాక్టీస్ సెషన్లో బాగా కష్ట పడటం.. అవకాశం వచ్చినప్పుడు జట్టుకు ఉపయోగపడే విధంగా పరుగులు చేయడం.. నా చేతిలో ఉన్న దాని గురించి ఆలోచిస్తాను తప్ప.. టీమిండియాకు ఓపెనింగ్ జోడి గా ఎన్నో పరుగులు చేసిన కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ లను  స్థానం నాకు కావాలని అడగలేను అంటూ చెప్పుకొచ్చాడు ఇషాన్ కిషన్. కాగా రోహిత్ శర్మ, కె.ఎల్.రాహుల్ జట్టులోకి వచ్చిన తర్వాత ఇషాన్ కిషన్ ను ఏ స్థానంలో బ్యాటింగ్ కు దింపుతారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: