ఈ క్రమంలోనే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తాను ఏదో ఒక విధంగా క్రికెట్ కి దగ్గరగానే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది అన్న విషయం తెలిసిందే. చిన్నప్పటినుంచీ క్రికెటే జీవితంగా బతికిన తాను.. ఇక ఇప్పుడు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికి ఏదో ఒక విధంగా క్రికెట్ తో సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాను అంటూ తెలిపింది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయట పెట్టింది మిథాలీ రాజ్. రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు అంటూ ప్రశ్నించగా ఆసక్తిగల సమాధానం చెప్పింది.
బీసిసిఐ అడ్మినిస్ట్రేషన్ లో పని చేసేందుకు ఎంతగానో ఇష్టపడతా అంటూ ఇంటర్వ్యూ లో సమాధానం చెప్పింది మిథాలీ రాజ్. ఒక క్రీడా కారిణిగా తన కెరీర్లో ఎన్నో దశలు చూశాను అంటూ చెప్పిన మిథాలీ రాజ్.. తన 23 ఏళ్ల కెరీర్లో ఉన్న అనుభవాన్ని మొత్తం ఉపయోగించుకోగలుగుతాను అంటూ మనసు లో మాట బయట పెట్టేసింది. మహిళల ఐపీఎల్ ద్వారా ప్రతిభావంతులైన ఎంతో మంది క్రీడాకారులను గుర్తించే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చింది. రానున్న రోజుల్లో ఈ సీనియర్ క్రికెటర్ సేవలను బీసీసీఐ ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి