కెరీర్ ముగిసిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా కం బ్యాక్ ఇచ్చాడు టీమిండియా సీనియర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గత ఏడాది వరకు కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించినా దినేష్ కార్తీక్ ఈ ఏడాది మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లోకి వచ్చేశాడు. దినేష్ కార్తీక్ ఏ జట్టు లో ఉంటే ఏంటి.. అదే పేలవ కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో అతని లో దాగి ఉన్న ఫినిషర్ ను బయటకు తీసుకొచ్చాడు.


 ప్రతి మ్యాచ్లో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఐపీఎల్ అభిమానులందరినీ కూడా ఆశ్చర్య పరిచాడు అని చెప్పాలి. దినేష్ కార్తీక్ ఏంటి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం ఏంటి అని ఎంతోమంది అభిమానులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇలా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన దినేష్ కార్తీక్ అసలు సిసలైన ఫినిషర్ గా కనిపించడం తో అతని టీమిండియా లోకి తీసుకోవాలని డిమాండ్ లు ఎక్కువయ్యాయి. అనుకున్నట్లుగానే అతనికి సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ లో అవకాశం కల్పించింది టీమిండియా.


 ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా వేదిక జరగబోయే టి20 వరల్డ్ కప్ లో ఈ సీనియర్ బ్యాట్స్మెన్ కు చోటు దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది టి 20 ప్రపంచకప్ లో టీం ఇండియా గెలవాలంటే జట్టులో కచ్చితంగా సీనియర్ దినేష్ కార్తీక్ ఉండాల్సిందే అంటు అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ దూకుడైన ఆటతోనే ఆకట్టుకున్నాడు. అతని ప్రదర్శన కారణంగానే ఆర్సీబీ ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది. నేనైతే ఐదు ఆరు స్థానాల కోసం దినేష్ కార్తీక్ ని ఖచ్చితంగా జట్టులో ఉంచుతాను అని చెప్పుకొచ్చాడురికీ పాంటింగ్..

మరింత సమాచారం తెలుసుకోండి: