క్రికెట్ ఆటగాళ్లకు సంబంధించి ఏ చిన్న విషయం తెర మీదికి వచ్చిన అదే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  కొన్ని వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. దినేష్ కార్తీక్ ప్రెస్మీట్ లో మాట్లాడుతూ ఎందుకో ఒక్కసారిగా వణికిపోయాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన నాలుగవ టి20 మ్యాచ్ లో భాగంగా దినేష్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ తో టీమిండియాకు విజయాన్ని అందించాడు అన్న విషయం తెలిసిందే.


 ఏకంగా 27 బంతుల్లో 55 పరుగులు చేసి అటు బౌలర్లపై ఒక రకంగా నిప్పులు చెరిగాడూ దినేష్ కార్తీక్. ఒకవేళ అతను అంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడక పోయి ఉంటే టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడిపోయేది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా దినేష్ కార్తీక్ నిలిచాడు. ఇక మ్యాచ్ ఇన్నింగ్స్ తర్వాత అటు మీడియాతో మాట్లాడిన దినేష్ కార్తీక్ ఒక్కసారిగా పైన దేనినో చూసి భయపడి పోయాడు.  ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా కార్తీక్ దేనికి భయపడ్డాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.


 మీడియా కాన్ఫరెన్స్ లో భాగంగా అటు మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పనిలో ఉన్నాడు దినేష్ కార్తీక్. ఇక ఇదే సమయంలో గాల్లోకి చూసిన దినేష్ కార్తిక్ ఏదో తన వైపు దూసుకు వస్తుంది అన్న రీతిలో భయపడిపోయాడు. ఇక ఆ తర్వాత కాసేపటికి తేరుకుని సారీ అక్కడినుంచి వచ్చిన బంతిని నా వైపు దూసుకు వచ్చినట్లు అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా దినేష్ కార్తీక్ రియాక్షన్ కాస్త వైరల్ గా మారి పోవడం తో ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: