సాధారణంగా వన్డే క్రికెట్ లో మంచి ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ సెంచరీ చేయడం సర్వసాధారణం. ఎందుకంటే టీ-20 ఫార్మెట్లో అయితే అటు క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ మొదటి బంతి నుంచి సిక్సర్లు ఫోర్లు కొట్టడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అదే వన్ డే ఫార్మాట్ లో అయితే బ్యాట్స్మెన్ క్రీజు లోకి వచ్చి కాస్త కుదురుకున్న తర్వాత ఇక బౌలర్లపై వీరవిహారం చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువగా బ్యాట్స్మెన్లు వన్డే ఫార్మాట్లో సెంచరీలతో చెలరేగిన పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే సాధారణంగా మంచి ఫాంలో కొనసాగుతున్న బ్యాట్స్మెన్లు బౌలర్లలో చెడుగుడు ఆడుతూ భారీ సిక్సర్లతో తక్కువ బంతుల్లోనే సెంచరీ చేయడం ఇప్పటి వరకు చాలాసార్లు చూశామూ. అయితే కొన్ని కొన్ని సార్లు ఇక ఒకే మ్యాచ్ లో ఇద్దరు బ్యాట్స్మెన్లు కూడా సెంచరీతో అదరగొడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఒకే ఇన్నింగ్స్ లో ముగ్గురు బ్యాట్స్మెన్  సెంచరీ చేయడం మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. నెదర్లాండ్స్ - ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఇలాంటి అరుదైన రికార్డు క్రియేట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లు ఒకే ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు చేశారు.



 దీంతో ఇప్పటి వరకు ఒకే ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు చేసిన ఆటగాళ్లు ఎవరు అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే.. 2015లో వెస్టిండీస్పై దక్షిణ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు హషీమ్ ఆమ్లా (153) రోస్సో (128) ఎబి డివిలియర్స్ (149) ముగ్గురు సెంచరీలు చేశారు. ఇక అదే ఏడాది భారత్ పై సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు క్వింటన్ డికాక్ (109) డూప్లేసెస్ (133 ) ఎబి డివిలియర్స్ (119 ) ఇలా ముగ్గురు సెంచరీలు చేశారు. తాజాగా నెదర్లాండ్స్ పై ఇంగ్లాండ్ ఆటగాళ్లు సాల్ట్ (122) డేవిడ్ మలాన్ (125) జోస్ బట్లర్ (165) ఇలా ముగ్గురు సెంచరీలతో అదరగొట్టారు. ఇలా అంతర్జాతీయ వన్డేఫార్మాట్ క్రికెట్ లో ఒకే ఇన్నింగ్స్ లో ముగ్గురుసెంచరీ చేయడం మూడుసార్లు మాత్రమే జరిగింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: