సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే చాలు ఇక స్టేడియం కు తరలి వెళుతుంటారు ప్రేక్షకులు. తమ అభిమాన ఆటగాళ్లు అటు మైదానంలో చెలరేగి  ఆడుతూ ఉంటే ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు వింతైన సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. నీకు ఇలా మైదానంలో ఎవరైనా వింత సెలబ్రేషన్ చేసుకున్నారు అంటే అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలా కొన్ని కొన్ని సార్లు అభిమానులు చేసుకునే సెలబ్రేషన్స్ హద్దుమీరి పోతూ ఉంటాయి. చూడటానికి ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.


 ఇంగ్లాండ్ అభిమానులు ప్రదర్శించిన అత్యుత్సాహం ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భాగంగా ఇంగ్లండ్ ఆటగాడు బెయిర్ స్ట్రో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునీ ఏకంగా 130 పరుగులతో సెంచరీ చేసి అదరగొట్టాడు. అయితే బెయిల్ తో సెంచరీ పూర్తి చేసుకోగానే బర్మీ ఆర్మీ గా పిలుచుకునే కొంతమంది అభిమానులు బెయిర్ స్ట్రో వైపు  తాము వేసుకున్న చెప్పులు షూస్ తీసి చూపించడం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అతని మీద కోపంతో ఇలా చూపించలేదు ఇది కూడా సెలబ్రేషన్ లో ఒక భాగం కాబట్టి ఇలా చూపించినట్లు స్టేడియంలో అభిమానులు తెలిపారు.


 తమ అభిమాన ఆటగాడు అద్భుతమైన ప్రదర్శన చేసిన సమయాల్లో ఇలా వెరైటీగా సెలబ్రేషన్స్ చేసుకోవడం బర్మీ ఆర్మీ కి అలవాటేనట. ఏది ఏమైనా ఇలా సెంచరీ చేసినప్పుడు అభిమానులు చెప్పులు షూస్ చూపించి సెలబ్రేషన్స్ చేసుకున్న వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన తర్వాత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇక భిన్నంగా కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: