ప్రస్తుతం ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా మధ్య మహిళల జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది  అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మారిజాన్ కాప్ సెంచరీతో అదరగొట్టింది. అయితే ఈ అదిరిపోయే సెంచరీతో ఒక్కసారిగా రికార్డుల మోత మోగించింది అని చెప్పాలి. అయితే మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనే అద్భుతమైన సెంచరీ సాధించింది. అయితే ఈ మహిళా క్రికెటర్కు తన టెస్ట్ కెరీర్లో ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం గమనార్హం.. 213 బంతుల్లో 150 పరుగులు చేసిన ఇక తమ జట్టుకు 284 పరుగులు గౌరవప్రదమైన స్కోరు సాధించటంలో ప్రముఖ పాత్ర వహించింది అని చెప్పాలి.


 అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో భాగంగా టాస్ ఓడి  పోయిన దక్షిణాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే అటు ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో నలభై ఐదు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది దక్షిణాఫ్రికా జట్టు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ కాప్ అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టును ఆదుకుంది అని చెప్పాలి.ఒక వైపు వికెట్లు పడుతున్నా ఎక్కడ తడబడకుండా ఒంటరి పోరాటం చేసింది. ఏకంగా 150 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు అందించింది. తద్వారా పలు రికార్డులు కొల్లగొట్టింది.


 సెంచరీ ద్వారా కాప్ సాధించిన రికార్డు ఇవే..
150 పరుగులతో టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించింది కాప్.
►అంతకుముందు 1961లో వైవోన్ వాన్ మెంట్జ్ (105) పేరుపై ఈ రికార్డు ఉండేది.
►మహిళల టెస్టుల్లో ఆరు లేదా ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్‌ వచ్చి అత్యధిక స్కోర్‌ సాధించిన తొలి క్రికెటర్‌ కూడా కాప్ కావడం గమనార్హం .
►మహిళల టెస్టుల్లో  వేగంగా 150 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా కూడా కాప్ .
► కాప్‌ 212 బంతుల్లో ఈ ఘనత సాధించగా. అంతకుముందు ఆస్ట్రేలియా క్రికెటర్‌ కరాన్‌ రోల్టాన్‌ 213 బంతుల్లో ఈ ఫీట్‌ను సాధించిన క్రికెటర్ గా ఉండేది .
►మహిళల టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన జాబితాలో కాప్‌(150) ఐదో స్థానంలో నిలిచింది.
ఆస్ట్రేలియా క్రికెటర్‌ మిచెల్ గోజ్కో 204 పరుగులతో ఈ లిస్టులో టాప్ లో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: