ప్రస్తుతం భారత క్రికెట్ లో సీనియర్ స్పిన్నర్ గా కొనసాగుతున్న యుజ్వేంద్ర చాహల్ ఇండియా ఆడే ప్రతి మ్యాచ్లో కూడా ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇండియాలో ఎంతోమంది స్పిన్నర్లు ఉన్న చాహల్ కు బంతి పై ఉన్న కంట్రోలింగ్ మిగతా వారికి లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని సార్లు. ఎందుకంటే బ్యాట్స్మెన్ లకు ఎక్కడ వేస్తే వికెట్ పడుతుంది అన్న విషయం చాహల్ కు బాగా తెలుసు. అందుకే ఇక వికెట్ పడకుండా బ్యాట్స్మెన్లు ఆచితూచి ఆడుతున్న సమయంలో చాహల్ చేతికి బంతిని అప్పగిస్తూ ఉంటారు.


 ఇక జట్టు కెప్టెన్ తన మీద ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ కీలక సమయంలో వికెట్లు పడగొడతాడు చాహల్. ప్రతి ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన చేసే చాహల్ ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కూడా ఇరవై ఏడు వికెట్లతో పర్పుల్ క్యాప్ హోల్డర్ గా కూడా రికార్డు సృష్టించాడు. ఇక ఇటీవలే అటు ఐపీఎల్ లో కూడా సత్తా చాటాడు అని చెప్పాలి. అటు స్వదేశంలో సౌతాఫ్రికాతో టీమ్ ఇండియా ఆడిన మ్యాచ్ లలో కీలకంగా వ్యవహరించారు చాహల్.


 అయితే వన్డే టి20 ఫార్మాట్లలో తన ప్రదర్శన తో అదరగొడుతున్న చాహల్ టెస్ట్ ఫార్మాట్ కి మాత్రం దూరంగానే ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ కామెంటేటర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాహల్ ప్రతిభపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్ లో బెస్ట్ స్పిన్ బౌలర్ అతను. వరల్డ్ క్లాస్ బౌలర్ . బంతి పై చాహల్ కు కంట్రోలింగ్ ఎంతో బాగా ఉంటుంది. కానీ అతను ఎందుకు టెస్ట్ ఫార్మాట్ ఆడటం లేదు అన్నది మాత్రం అర్థం కావట్లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు గ్రేమ్ స్వాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: