సాధారణంగా భారత జట్టు ఒకే రోజు ఒక మ్యాచ్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు  భారత జట్టును రెండుగా రెండు టీములుగా విభజించిన  సమయంలో వేరు వేరు పర్యటనలకు వెళ్ళినప్పుడు ఇక ఒకేసారి రెండు మ్యాచ్ లు ఆడటం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. గతంలో శ్రీలంక పర్యటనలో యువభారత్.. ఇంగ్లండ్ పర్యటనలో సీనియర్ ఆటగాళ్లతో కూడిన టీమిండియా మ్యాచ్ ఆడాయ్ అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా టీమ్ ఇండియా మూడు మ్యాచ్లు ఆడుతుంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


ఒకేరోజు మూడు మ్యాచ్లు ఆడడం.. అంటే టీమిండియాను మూడు టీములుగా విభజిస్తారా అని అనుకుంటున్నారు కదా. అలా ఏం విభజించరు. అయితే మూడు మ్యాచ్లు ఎలా ఆడుతుంది అంటే.. జులై 1వ తేదీన ఇంగ్లాండ్ భారత్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. బూమ్రా కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగబోతోంది. గత ఏడాది కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన మ్యాచ్ రీ షెడ్యూల్ చేయగా ప్రస్తుతం జరుగుతోంది. అదే సమయంలో మరోవైపు భారత మహిళల జట్టు శ్రీలంక జట్టుతో వన్డే మ్యాచ్ ఆడబోతుంది ఇక ఈ రెండు మ్యాచ్లలో ఒకే రోజు జరుగుతూ ఉండటం గమనార్హం. ఇక మూడో మ్యాచ్ ఎవరు ఆడబోతున్నాడు అని ఆత్రుత పెరిగి పోయింది కదా.. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా టెస్ట్ మ్యాచ్ తోపాటు టి20 సిరీస్  కూడా ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఒకటో తేదీ నుంచి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వార్మప్ మ్యాచ్ ఆడింది టీమిండియా. ఇక ఇప్పుడు టీ20 సిరీస్ కి ముందు  కూడా వార్మప్ మ్యాచ్ ఆడాలి కదా. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ తో 3 టీ20 ల సిరీస్లో భాగంగా తొలి టి20 ప్రాక్టీస్ మ్యాచ్ కూడా జులై 1వ తేదీన ప్రారంభం కాబోతోంది. ఇలా టీమిండియా ఒకే రోజు ఏకంగా మూడు మ్యాచ్ లు ఆడబోతు ఉండడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: