ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన టెస్ట్ సిరీస్ ఆడుతుంది భారత జట్టు. టెస్టు సిరీస్ పై అందరి క్రికెట్ ప్రేక్షకుల దృష్టి ఉంది అని చెప్పాలి. టెస్ట్ సిరీస్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. అయితే ఒకవైపు ఇంగ్లాండ్ జట్టు తో టెస్టు సిరీస్ జరుగుతున్న సమయంలోనే మరోవైపు పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఆడబోయే టీమిండియా జట్టు ప్రస్తుతం వార్మప్ మ్యాచ్లో ఆడుతూ ఉండటం గమనార్హం. కాగా ఈ వార్మప్ మ్యాచ్లో భాగంగానే ఇటీవల నిర్వహించిన  మ్యాచ్లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి విజయాన్ని అందుకుంది.



 తొలుత దెర్బీషైర్ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత  20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత చేదన కు  దిగిన భారత జట్టు   16.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేధించింది అనే చెప్పాలి. ఇక ఈ ఇన్నింగ్స్ లో భాగంగా దీపక్ హుడా  59 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో   అదరగొట్టాడు. ఇక సంజూ శాంసన్  38 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 36 పరుగులతో రాణించారు. బౌలర్లలో అర్ష దీప్ 2, ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు, అక్షర్ పటేల్,  వెంకటేష్ అయ్యర్ చెరో వికెట్ తీశారు.  నార్తన్ప్టన్  షైర్ తో ఇక మరో వార్మప్ మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా.


 అయితే ప్రస్తుతం రీ షెడ్యూల్ చేసిన టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే అటు భారత జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్ మ్యాచ్లు ఆడేందుకు సిద్ధమవుతున్న అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీ20 వన్డే సిరీస్లో ఆడబోయే జట్ల పూర్తి వివరాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇక ఎంతో మంది యువ ఆటగాళ్లకు టీమిండియాలో అవకాశం దక్కిందని తెలుస్తోంది. ఇక టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ దూరం కావడంతో ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో బరిలోకి దిగింది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే ఎంతో నిలకడగా రాణిస్తోంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: