గత కొన్ని రోజుల నుంచి భారత మహిళల జట్టు తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత మహిళల జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటనలో భాగంగా టీ20 వన్డే సిరీస్ లు ఆడాల్సి ఉంది. అయితే ఇప్పటికే టి20 సిరీస్ ముగిసింది. ఇక ఈ టి 20 సిరీస్ లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించినా టీమిండియా జట్టు ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సొంత గడ్డపై శ్రీలంక సిరీస్ కైవసం చేసుకుంది.


 అయితే మూడో మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్స్వీప్ చేస్తుందని అనుకున్నప్పటికీ ముడవా మ్యాచ్ లో గెలిచిన శ్రీలంక పరువు నిలబెట్టుకుంది. అయితే ఇప్పుడు వన్డే సిరీస్లో కూడా ఇదే జోరు కొనసాగించింది భారత మహిళల జట్టు వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. అయితే రెండో వన్డే మ్యాచ్లో భాగంగా వార్ వన్ సైడ్ అన్నట్లుగానే అటు భారత మహిళల జట్టు ప్రదర్శన చేసింది అని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 173పరుగుల చేసింది.


 కాగా 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఒక వికెట్ కోల్పోకుండానే టార్గెట్ ను చేదించడం  గమనార్హం. ఇందులో స్మృతి మందాన 94, 71 పరుగులు చేసి రాణించారు. దీంతో ఈ ఓపెనింగ్ జోడి అరుదైన రికార్డును సాధించింది అని చెప్పాలి. ఇప్పటివరకు మహిళా క్రికెట్ లో లక్ష్యఛేదనలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేధించిన అత్యధిక టార్గెట్ ఇక ఇదే కావడం గమనార్హం. ఇలా ఒక్క వికెట్ పడకుండా 174 పరుగులు చేధించడంపై ప్రస్తుతం ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం 2-0 తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా క్లీన్స్వీప్ ఫై కన్నేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: