జస్ప్రిత్ బూమ్రా కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియాకు ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో చివరికి నిరాశ తప్పలేదు అని చెప్పాలి. తొలి మూడు రోజులు ఎంతో అద్భుతంగా ఆడిన టీమిండియా నాలుగు రోజు పట్టు కోల్పోవడంతో చివరికి ఇంగ్లాండ్ జట్టుకు విజయం వరించింది. దీంతో సిరీస్ 2-2 తో సమం అయిన విషయం తెలిసిందే. 378 పరుగుల భారీ టార్గెట్ ను ఎంతో అలవోకగా ఛేదించింది ఇంగ్లాండ్ జట్టు. దీంతో భారత్కు నిరాశ తప్పలేదు. అయితే ఇక భారత ఓటమిపై అభిమానులు అందరూ కూడా తీవ్ర నిరాశలో మునిగిపోయారు.


 గెలుస్తుంది అనుకున్న మ్యాచ్లో భారత్ ఓడిపోవడంతో మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐదవ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఓడిపోవడం పై టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌట్ అవ్వడమే తమ కొంపముంచింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మూడు రోజుల ఆటలో టీమిండియా ఎంతో బాగా ఆడిందని.. కానీ నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అవ్వడమే ఇంగ్లండ్కు కలిసి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.


 ఇక తాము అక్కడే మ్యాచ్లో వెనకబడి పోయాము అంటూ తాత్కాలిక కెప్టెన్ బూమ్రా అంటున్నాడు. అయితే గత ఏడాది జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో వర్షం పడకుండా ఉంటే టీమిండియా గెలిచేది అంటూ ఇటీవలే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఈ సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ లో వర్షం కారణంగా చివరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది. లేదంటే టీమిండియా విజయాన్ని సాధించే అవకాశాలే అప్పట్లో ఎక్కువగా ఉన్నాయి. కాగా స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో 35 పరుగులు సాధించడం పై స్పందిస్తూ తాను ఆల్రౌండర్ లాగా ఫీల్ అవ్వడం లేదు అంటూ జస్ప్రిత్ బూమ్రా చెప్పుకొచ్చాడు. ఇక ఇంగ్లాండు ఆటగాళ్లు కూడా బాగా ఆడారని.. సిరీస్ సమం చేసుకున్నారు అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక రిషబ్ పంత్ రవీంద్ర జడేజాలు జట్టును ఆదుకున్నారు అంటూ ప్రశంసించాడు జస్ప్రిత్ బూమ్రా.

మరింత సమాచారం తెలుసుకోండి: