గత కొంత కాలం నుంచి ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే అతని ఫామ్ గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఇదే విషయంపై స్పందిస్తూ విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే గత కొంత కాలం నుంచి కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్న వారు కూడా ఎక్కువ అవుతున్నారు. ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ కోహ్లీ కి మద్దతుగా నిలుస్తూ మాట్లాడిన తీరు అభిమానులు అందరికి కూడా రోహిత్ శర్మ పై గౌరవాన్ని పెంచింది. ఇక సునీల్ గవాస్కర్ సైతం ఒకప్పుడు రోహిత్ ను టార్గెట్ చేయనిది.. ఇక ఇప్పుడు ఎందుకు కోహ్లీని టార్గెట్ చేస్తున్నారు అంటూ ఘాటుగానే స్పందించాడు.



 ఇక ఇప్పుడు ఏకంగా బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం ఈ విషయంపై స్పందిస్తూ కోహ్లీ కి మద్దతుగా నిలిచాడు అని చెప్పాలి. కోహ్లీ సామర్థ్యం ఆటలో నాణ్యత ఏంటో అంతర్జాతీయ క్రికెట్లో అతను నమోదు చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఇవన్నీ లేవంటే ఆ రికార్డులు సాధ్యమేనా. కోహ్లీ  ఎంత గొప్ప ఆటగాడో  అతనికి తెలుసు. అయితే గత కొంత కాలం నుంచి మాత్రం తన సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడటం లేదు. ఆ విషయం అతనికి కూడా బాగా తెలుసు. 13 ఏళ్లుగా టీమిండియాకు ఆడుతున్న విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్ అందుకని మళ్లీ సక్సెస్ అవుతాడు అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.



 అయితే టీమ్ ఇండియా తరఫున వరుసగా విఫలమవుతున్న విరాట్ కోహ్లీని తప్పించి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి అంటూ మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, వెంకటేష్ ప్రసాద్ లు కూడా డిమాండ్ చేయడం సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.  ఈ విషయంపై కూడా స్పందిస్తూ ఆటలో ఇవన్నీ ఒక భాగం లాంటివే.  క్రికెట్ కెరీర్లో ఎత్తుపల్లాలు ఉంటాయి. సచిన్ ద్రవిడ్ లాంటి క్రికెటర్లతో పాటు నాకు కూడా ఇలా జరిగింది. ఇప్పుడు కోహ్లీకి కూడా ఇదే జరుగుతోంది. భవిష్యత్తులో ఎవరికైనా జరగవచ్చు. అయితే ఒక ఆటగాడిగా అన్ని విమర్శలను విని తెలుసుకుని కేవలం ఫామ్ లోకి రావడం పైన దృష్టి పెట్టాలి అంటూ చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ.

మరింత సమాచారం తెలుసుకోండి: