నీరజ్ చోప్రా.. ఈ పేరు చెబితే చాలు ఎందుకో భారతీయులందరిలో ఏదో తెలియని ఒక నమ్మకం వస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతలా 130 కోట్ల మంది భారతీయుల నమ్మకం  నిలబెట్టాడు నీరజ్ చోప్రా. ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు ప్రతిసారి గోల్డ్ మెడల్ సాధిస్తారు అనే నమ్మకంతో బరిలోకి దిగడం.. చివరికి వెండి, రజిత పథకాలతో సరి పెట్టుకోవడమే  జరుగుతూ వచ్చింది. ఇలాంటి సమయంలోనే ఇక దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ  భారత్కు గోల్డ్మెడల్ సాధించి పెట్టాడు నీరజ్ చోప్రా. జావలిన్ త్రో విభాగంలో రికార్డు స్థాయిలో త్రో విసిరి ఇక మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు.


 ఈ క్రమంలోనే విశ్వ వేదికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడించాడు అని చెప్పాలి. భారత్ కి గోల్డ్ మెడల్ సాధించడం చేతకాదు అని విమర్శలు చేసిన వారి నోళ్ళు మూయించాడు. 130 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని నిలబెట్టాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో అప్పటివరకూ ఎవ్వరికి తెలియని నీరజ్ చోప్రా ఒక్కసారిగా అందరికీ సుపరిచితుడు గా ఇండియాలో సూపర్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. దీంతో నీరజ్ చోప్రా ఎప్పుడు ఏ గేమ్స్ లో పాల్గొంటున్నాడు అనే దానిపైనే దృష్టి ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం భారతీయుల కళ్ళన్ని  నీరజ్ చోప్రా మీదే ఉన్నాయి అని చెప్పాలి.


 నేటి నుంచే అమెరికా వేదికగా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రారంభం కాబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ నుంచి 20 మంది అథ్లెట్లు ఇక ఈ పోటీలో పాల్గొంటున్నారు. ఇక ఇందులో నీరజ్ చోప్రా కూడా ఉండటం గమనార్హం. అయితే టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి అదరగొట్టిన జావలిన్ త్రో లాయర్ నీరజ్ చోప్రా సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలువబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ మెగా టోర్నీ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు ఒకే ఒక పతకం సాధించింది. 2003లో లాంగ్ జంప్ లో కేవలం రజతపతకం తోనే సరిపెట్టుకుంది. దీంతో గోల్డ్మెడలిస్ట్ నీరజ్ చోప్రా మరోసారి బంగారు సాధిస్తాడని నమ్మకంతో అందరి కళ్ళు అతని మీదే ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: