ఇటీవల ఇంగ్లాండ్లో పర్యటనలో భాగంగా టీమిండియా ఆడిన ముగింపు మ్యాచ్ అయినా మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా అద్భుతమే చేసి చూపించింది అన్న విషయం తెలిసిందే. 260 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమ్ ఇండియా జట్టు మొదటి నుంచే దూకుడైన ఆటతోనే ఆకట్టుకుంటుందని అందరు అనుకున్నారు. కానీ ఇలాంటి సమయంలోనే 72 పరుగుల వద్ద టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఇలాంటి సమయంలో ఇక్కడ టీమిండియాను ఆదుకునేది ఎవరు అని అభిమానులు అందరూ కూడా ఆశగా ఎదురు చూడటం మొదలుపెట్టారు.


 ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఒకవైపు ఆచితూచి ఆడుతూ తన వికెట్ ను కాపాడుకుంటూనే మరోవైపు అవసరమైనప్పుడల్లా సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే  113 బంతుల్లో 125 పరుగులు చేశాడు. కష్టాల్లో ఉన్న జట్టును విజయతీరాలకు నడిపించాడు అనే చెప్పాలి. అందుకు హార్దిక్ పాండ్యా కూడా మరో వైపు నుంచి తోడ్పాటు అందించాడూ అన్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా పంత్ ను  పొగడ్తలతో ముంచెత్తాడు.


 మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రిషబ్ పంత్ మొదట ఎంతో నెమ్మదిగా ఆడాడని.. కాని ఆ తర్వాత మాత్రం తన సహజసిద్ధమైన షాట్లు ఆడుతూ రెచ్చిపోయాడు అంటూ మెచ్చుకున్నాడు  హార్దిక్ పాండ్యా. అతడు చెలరేగుతూ ఉంటే చూస్తూ కూర్చోవాల్సిందే అని చెప్పాడు. ఈ క్రమంలోనే తామిద్దరం బ్యాటింగ్ చేసేటప్పుడు అతడికి కొన్ని సూచనలు చేసినట్లు హార్దిక్ పాండ్యా తెలిపారు.  పదే పదే అతనికి ఒకే మాట చెప్పాను. ఇలాంటి సమయంలో ఎలాంటి  రిస్క్ తీసుకోకపోవడమే మంచిది.. అది ఎంతో ముఖ్యమని సూచించాను. ఇక అతనికి నాకు ఉన్న నైపుణ్యాలతో పరుగులు చేయగలమని బలంగా నమ్మాను. ఇంగ్లాండ్ వైపు మళ్లీ మ్యాచ్ మారాలి మమ్మల్ని అవుట్ చేయడం ఒక్కటే మార్గం అని అనుకున్నాను. అందుకే మంచి భాగస్వామ్యం నిర్మిస్తే బాగుంటుందని భావించి ఆ దిశగా బ్యాటింగ్ చేశా అంటూ చెప్పుకొచ్చారు హార్దిక్ పాండ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: