ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని డ్రెస్సింగ్ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది యువ ఆటగాళ్లతో ముచ్చటించాడు. ఈ క్రమంలోనే ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉండగా మరో లెజెండరీ క్రికెటర్ టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చి అదే రీతిలో ఇండియా ఆటగాళ్లకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ ప్రస్తుతం ఇండియా డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చిన లెజెండరీ క్రికెటర్ ఎవరో తెలుసా వెస్టిండీస్ మాజీ ఆటగాడు లెజెండరీ బ్యాట్స్మన్ బ్రియాన్ లారా.
ఇటీవల తొలి వన్డే మ్యాచ్ ముగిసిన అనంతరం భారత డ్రెస్సింగ్ రూమ్లో బ్రియాన్ లారా ని చూసి భారత క్రికెటర్లు అందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే భారత స్పిన్నర్ చాహల్ టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్రియాన్ లారా ను కలిసి కాసేపు ముచ్చటించారు అని చెప్పాలి. ఇటీవల ఈ వీడియోని అటు బిసిసిఐ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ని కలిసిన బ్రియాన్ లారా కాసేపు మాట్లాడారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన బిసిసిఐ ఇద్దరు లెజెండ్స్ ఒక ఫ్రేమ్ అంటూ క్యాప్షన్ జోడించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి