మొన్నటి వరకు ప్రపంచ క్రికెట్లో ఎంతో అనుభవం సాధించిన క్రికెటర్లు మాత్రమే అరుదైన రికార్డులు సృష్టించడం లాంటివి చేసేవారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తున్న యువ క్రికెటర్లు కూడా సత్తా చాటుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది సీనియర్ క్రికెటర్ల కు సైతం సాధ్యం కాని రీతిలో అద్భుతమైన రికార్డులను సృష్టిస్తూ ప్రేక్షకులందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నారు. ఇటీవలి కాలంలో రికార్డులు సృష్టిస్తున్న వారి పేరు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి.


 అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ లో అనుభవం లేకపోయినప్పటికీ జట్టుకు ఒంటిచేత్తో విjaయాలను అందిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఒక యువ క్రికెటర్ పేరు సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది. అతను సాధించిన రికార్డు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతున్నారు  అని చెప్పాలి. ఎందుకంటే ఒక్క మ్యాచ్ లోనే అదిరిపోయే ప్రదర్శన చేసి ఎంతో మంది దిగ్గజ క్రికెటర్ల పక్కన చేరి పోయాడు ఆ యువ క్రికెటర్.. ఇటీవలే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక ప్రపంచ రికార్డు నమోదు అయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇంగ్లాండులోని గోమోర్గాన్ జట్టుకు సంబంధించిన ఆటగాడు సామ్ నార్త్ ఈస్ట్ లిస్టర్ షైర్ జట్టుతో మ్యాచులో అద్భుతమే సృష్టించాడు అనే చెప్పాలి. ఏకంగా ఒకే ఒక్క మ్యాచ్ లో 410 పరుగులు చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు అని చెప్పాలి. అయితే ఇందుకోసం కేవలం 450 బంతులను మాత్రమే తీసుకోవడం గమనార్హం.. ఇక ఈ అద్వితీయమైన ఇన్నింగ్సులో 45 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఫస్ట్క్లాస్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన టాప్ టెన్ ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కింది. ఈ లిస్టులో  వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా మొదటి స్థానంలో ఉన్నాడు. 1994లో వార్ విక్ షైర్ జట్టు తరఫున బ్రియాన్ లారా 501 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: