సాధారణంగా క్రికెట్ ఆడే ప్రతి ఆటగాడు కూడా ఎప్పుడూ రికార్డు వేట కొనసాగించాలని భావిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. కానీ ఇలాంటివి కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇక ఎప్పటికప్పుడు ఫిట్నెస్ ను కాపాడుకుంటూ మానసికంగా కూడా దృఢంగా  ఉంటూ ఇక అన్ని ఫార్మాట్లలో కొనసాగడం అంటే అది మామూలు విషయం కాదు. అయితే ఇక వన్డే ఫార్మాట్లో 100 మ్యాచ్ ల మైలురాయిని అందుకోవడం అంత సులభమైన విషయం కాదు అనే చెప్పాలి.


 అయితే వన్డే ఫార్మాట్లో 100 మ్యాచ్ ల మైలురాయిని అందుకోవడం ఒక ఎత్తు అయితే.. ఇక వందో మ్యాచ్ లో సెంచరీతో ఆకట్టుకోవడం మరో ఎత్తు. ఇలాంటివి కేవలం కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల భారత్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భాగంగా విండీస్ ఓపెనర్ షై హోప్ తన కెరీర్లో వంద వన్డే మ్యాచ్ ల మైలురాయిని అందుకున్నాడు. అదే సమయంలో ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వన్డే మ్యాచ్లో సెంచరీ చేసి  అరుదైన రికార్డు సృష్టించిన ఆటగాళ్ళు  ఎవరు అనే విషయం ప్రస్తుతం చర్చకు వచ్చింది.


 ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే.. గతంలో వెస్టిండీస్ జట్టు తరఫునుంచి గార్డెన్ గ్రీనిడ్జ్ వందో వన్డేలో సెంచరీ చేశాడు. న్యూజిలాండ్ జట్టు తరఫున కెయిన్స్ ఈ అరుదైన రికార్డు సాధించాడు. పాకిస్థాన్ జట్టు తరఫున మహమ్మద్ యూసుఫ్ కూడా ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంక జట్టు తరఫున కుమార సంగక్కర, వెస్టిండీస్ జట్టు తరఫున క్రిస్ గేల్, ఇంగ్లాండ్ జట్టు తరఫున ట్రెస్కో థిక్, వెస్టిండీస్ జట్టు తరఫున రామ్ నరేష్ శర్వాన్, ఆస్ట్రేలియా జట్టు తరఫున డేవిడ్ వార్నర్, ఇండియా తరఫున శిఖర్ ధావన్ ఈ ఘనత సాధించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: