ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంతలా రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి  సీజన్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఒక బ్రాండ్ అన్నట్లుగా మారిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఎప్పుడు తిరుగులేని ప్రస్థానం కొనసాగించింది. పదిహేనేళ్ల ఐపీఎల్ చరిత్రలో కేవలం రెండుసార్లు మాత్రమే ప్లే ఆఫ్లో అడుగుపెట్టకుండా వెనుదిరిగింది అని చెప్పాలి.


 ముఖ్యంగా గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ చేసిన పేలవమైన ప్రదర్శన ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా నిరాశపరిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఏంటి ఇలాంటి ప్రదర్శన చేయడం ఏంటి అందరూ అవాక్కయ్యారు అని చెప్పాలి. అయితే ఇక వచ్చే ఏడాది ఐపిఎల్ సీజన్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కప్పు గెలవాలన్న కసితో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగేందుకు సిద్ధం అయింది అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆల్రౌండర్ల పైనే దృష్టి పెట్టిందట చెన్నై సూపర్ కింగ్స్.


 చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లోనే ఉన్న ఈ యువ ఆల్రౌండర్ సామ్ కరణ్  ఏడాది గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. కానీ వచ్చే ఏడాది ఐపీఎల్ సమయానికి మాత్రం జట్టుకు అందుబాటులోకి వస్తాడు. అయితే వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన బెన్ స్టోక్స్ వచ్చే ఏడాది ఐపీఎల్కు  అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో అతనికి వేలం లో కొనుగోలు చేయాలని  భావిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. ప్రపంచంలోనే నెంబర్వన్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న షకీబ్ అల్ హాసన్ ను కూడా డీజే బ్రావోకు ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ క్రమంలోనే ఇలాంటి ఆల్ రౌండర్ల రాకతో జట్టును మరింత పటిష్టంగా మార్చాలని అనుకుంటుందట. కాగా షకీబ్ ఆల్ హాసన్ ఇప్పటివరకు కోల్కత నైట్ రైడర్స్,  సన్రైజర్స్ జట్ల తరఫున ఆడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Csk