ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు ఎంత అద్భుతమైన ప్రదర్శన చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంగ్లాండ్ లో వరుసగా టీ20 వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా అదే జోరును  వెస్టిండీస్ పర్యటనలో కూడా కంటిన్యూ చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే సొంతగడ్డపై వెస్టిండీస్ జట్టుకు ఊహించి షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఇక ఇలా రెండో మ్యాచ్లో కూడా విజయం సాధించిన అనంతరం మాట్లాడిన శిఖర్ ధావన్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్.


 యువ ఆటగాళ్లు అందరూ కూడా మంచి ప్రదర్శన చేశారని ఎవ్వరూ కూడా ఆత్మ విశ్వాసం కోల్పోలేదు అంటూ శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు. ఇక చివర్లో ఆవేష్ ఖాన్  కీలకమైన పరుగులు చేశాడు. ఇక ఇదంతా కేవలం బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగానే జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే  ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ధన్యవాదాలు తెలిపాడు శిఖర్ధావన్. అయితే ముందుగా అటు వెస్టిండీస్ ఓపెనర్లు శుభారంభం చేశారు అంటూ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.



 అయితే శిఖర్ ధావన్ ఇలా ఐపీఎల్కు థాంక్స్ చెప్పడానికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవలి కాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లకు ఐపీఎల్ ఒక మంచి వేదికగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అందరూ మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. భారత జట్టు లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక యువ ఆటగాళ్లందరూ కూడా మెరుగైన ప్రదర్శన చేయడానికి ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐపీఎల్లో ప్రపంచస్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఆటగాళ్లు కూడా ఉంటారు కాబట్టి ఆటగాళ్లు తక్కువ సమయంలోనే గొప్ప అనుభవం సాధించేందుకు కూడా ఐపీఎల్ ఉపయోగ పడుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl