ఇటీవలి కాలం లో శ్రీలంక బౌలర్ ప్రభాస్ జయసూర్య టెస్ట్ క్రికెట్ లో సంచలనం సృష్టిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్లో కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్య పరుస్తున్నాడు. దిగ్గజ బ్యాట్స్మెన్ లను సైతం ఎంతో అలవోకగా వికెట్ పడుతూ ఇక శ్రీలంక జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అనే చెప్పాలి. ఇటీవల పాకిస్థాన్తో జరిగిన మొదటి టెస్టులో వరుసగా వికెట్లు తీసి ఆకట్టుకున్న ప్రభాత్ జయసూర్య ఇక రెండవ టెస్ట్ లో కూడా తన స్పిన్ బౌలింగ్ తో మాయ చేశాడు.


 30 ఏళ్ల లేటు వయసు లో కూడా సుదీర్ఘ ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు. తన వైవిధ్యమైన స్పిన్ మాయా జాలంతో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ లను సైతం ముప్పు తిప్పలు పెడుతున్నాడు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యర్థుల  పాలిట సింహస్వప్నంలా మారిపోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు ప్రభాస్ జయసూర్య. కేవలం మూడు టెస్టులోనే 29 వికెట్లు పడగొట్టి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇటీవల పాకిస్థాన్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఎనిమిది వికెట్లు పడగొట్టి జయసూర్య  శ్రీలంక జట్టు 246 పరుగుల భారీ తేడాతో అపురూప విషయం అందుకోవడంలో కీలక పాత్ర వహించాడు. ఇక అంతకుముందు ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా టెస్టులో రెచ్చిపోయి వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే శ్రీలంక ప్రేక్షకులందరికి కూడా అబ్బురపరిచే విజయాన్ని తన స్పిన్ బౌలింగ్ తో అందించాడు. పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్టులో కూడా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఇలా మూడు టెస్ట్ మ్యాచ్ల లోనే 29 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: