ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు అన్న విషయం తెలిసిందే. జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక వెస్టిండీస్ లో టీ20 సిరీస్ లో కూడా అవకాశాన్ని దక్కించుకున్నాడు శ్రేయస్ అయ్యర్. కానీ మొదటి టి20 మ్యాచ్ లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు అని చెప్పాలి.. వన్డే సిరీస్లో అద్భుతంగా ఆడిన శ్రేయస్ టి20 సిరీస్ లో మాత్రం పరుగులు చేసేందుకు ఎంతగానో ఇబ్బంది పడిపోయాడు అని చెప్పాలి.


 విరాట్ కోహ్లీ గైర్హాజరి నేపథ్యంలో టీ20 జట్టులో అవకాశం దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ ఎందుకో ఆశించిన రీతిలో బ్యాటింగ్ మాత్రం చేయలేకపోయాడు. 4 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ గా పెవిలియన్ చేరాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ టి20 లకు ఎంపికపై టీమిండియా మాజీ కోచ్ వెంకటేశ్ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.  శ్రేయస్ అయ్యర్  ను జట్టులోకి సెలెక్ట్ చేయడాన్ని తప్పు పట్టాడు.


 సెలక్షన్ కమిటీ లో కొంతమంది బ్యాట్స్మెన్లను  టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో  జట్టును ఎంపిక చేస్తున్నట్లు గతంలో చెప్పారు. అయితే ఇప్పటికే సంజు శాంసన్,  దీపక్ హుడా ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లు టి-20లో మంచి ఫామ్లో ఉన్నారు. అలాంటప్పుడు శ్రేయస్ అయ్యర్ జట్టులో ఉండడం అవసరంలేదు. ఎందుకంటే టి20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కె.ఎల్.రాహుల్ తప్పకుండా వుంటారు.  ఈ క్రమంలోనే ఆ తర్వాతి స్థానాల్లో సరైన బ్యాటింగ్ చేయడానికి మిగతా సభ్యులు ఎంపికపై దృష్టి పెట్టాలి అంటూ వెంకటేశ్ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇక ఇతని పోస్ట్ పై ఒక అభిమాని స్పందిస్తూ అంతకుముందు మ్యాచ్ లో శ్రేయస్ బాగా రాణించాడు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో రాణించలేకపోయాడు  అంటూ చెప్పగా.. దీనికి బదులు ఇచ్చిన వెంకటేష్ ప్రసాద్ వన్డేలలో శ్రేయస్ అయ్యర్ బాగా ఆడాడు. కానీ టి20 ఫార్మాట్లో అతని కంటే ఉత్తమ ఆటగాళ్లు ఉన్నారు అని నా ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: