విశ్వ వేదిక అయిన కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా మొదటి సారి క్రికెట్ కి అవకాశం దొరికింది అన్న విషయం తెలిసిందే. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని దేశాల జట్లు కూడా సిద్ధమై పోతున్నాయ్. ఈ క్రమంలో అద్భుతంగా రాణించడానికి రెడీ అయ్యాయి. ఇక భారత మహిళల జట్టు కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రీడల్లో భాగంగా మొదట ఆస్ట్రేలియా జట్టుతో తలబడింది భారత జట్టు. ఈ క్రమంలోనే ఎంతో హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో చివరికి భారత జట్టుకు మొదటి అడుగులోనే చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలు అయింది.



 మూడు వికెట్ల తేడాతో ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలో మొదటి  ఓడిపోయి నిరాశ చెందింది టీమిండియా. అయితే గెలుపు కోసం భారత మహిళల జట్టు ఆఖరివరకు పోరాడినప్పటికీ అటు ఆస్ట్రేలియా బ్యాటర్ లూ అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో చివరికి విజయం వారి వశం అయింది. అయితే భారత జట్టు ఓడిపోయినప్పటికీ ఇక టీమిండియా బౌలర్ రేణుక సింగ్ ఠాగూర్ మాత్రం అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకుంది. నాలుగు ఓవర్లు వేసిన రేణుక సింగ్ 18 పరుగులు మాత్రమే ఇచ్చి  ఏకంగా నాలుగు వికెట్లు కూడా కొల్లగొట్టింది. రేణుక సింగ్ బౌలింగ్ దాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు అందరూ కూడా పెవిలియన్కు క్యూ కట్టారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే రేణుక సింగ్ ఒక అద్భుతమైన ఇన్ సింగర్ సంధించి వికెట్ తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. రేణుక వేసిన బంతిని ఆడేందుకు మెగ్రత్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే బంతిని డిఫెండ్  చేయడానికి ప్రయత్నించింది. కానీ ఊహించని రీతిలో బంతి మెక్గ్రాత్ బ్యాట్ ప్యాడ్స్ మధ్యలో నుంచి దూసుకువెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో మెగ్రత్ అవాక్ అయిపోయింది అని చెప్పాలి. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చివరికి పెవిలియన్ చేరింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా  ఎంతమంది రేణుక సింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: