గాయం కారణంగా అటు కె.ఎల్.రాహుల్ జట్టుకు దూరంగా ఉండటంతో ఓపెనర్ స్థానం ఖాళీ అయ్యింది. ఎవరు ఓపెనర్‌గా అయితే బాగుంటుంది అనే విషయం పై టీమిండియా ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చింది. ఇలాంటి సమయంలోనే మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సూర్యకుమార్ యాదవ్ మూడవ టీ20 మ్యాచ్ లో అదిరిపోయే ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. మెరుపు ఇన్నింగ్స్ తో అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని ఇక ఓపెనర్ గానే పిక్స్ చేయాలి అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం  వ్యక్తం చేస్తున్నారు.


 ఇలాంటి సమయంలోనే రోహిత్ శర్మ కుమార్ యాదవ్ విషయంలో ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాడు అని తెలుస్తుంది. అయితే గతంలో ఎంతో మంది బ్యాట్స్మెన్లు అటు మిడిలార్డర్లో లోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత ఓపెనర్ గా మారిపోయారు. అలాంటి వారిలో మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. మిడిలార్డర్లో పెద్దగా రాణించని  వీరేంద్ర సెహ్వాగ్ ను తన స్థానం త్యాగం చేసి మరి సచిన్ టెండూల్కర్‌తో ఓపెనర్‌గా దింపాడు కెప్టెన్ సౌరవ్ గంగూలీ. దీంతో అప్పటి నుంచి అతని దశ మారి పోయింది. 2013లో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ గా ఉన్నా రోహిత్ శర్మకు ఓపెనర్‌గా ధోని అవకాశం ఇవ్వగా.. రోహిత్ శర్మ దూసుకెళ్ళాడు.


 అచ్చంగా ఇలాగే ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ సూర్య కుమార్ యాదవ్ ను కూడా ఓపెనర్‌గా ఫిక్స్ చేయాలని భావిస్తున్నాడట. ఇటీవలే మూడో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత టీమిండియాకు ఒక డాషింగ్ ఓపెనర్ దొరికాడని ఆశలు అందరిలో పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే  సూర్యకుమార్ యాదవ్ ను ఓపెనర్ గా ఫిక్స్ చేసి ఇక ఓపెనర్ కేఎల్ రాహుల్  ను మిడిల్ ఆర్డర్లో ఆడించాలని రోహిత్ శర్మ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం సూర్యకుమార్ యాదవ్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: