టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ప్రతి విషయం పై స్పందిస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటారు. ఇకపోతే ఇటీవల విరాట్ కోహ్లీ ఫామ్ పై స్పందించిన ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంను తప్పుబట్టారు ఆకాష్. వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్ లో గానీ టి20 సిరీస్ లో కానీ ఏదో ఒక దాంట్లో విరాట్ కోహ్లీ కి అవకాశం ఇవ్వాల్సింది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో జట్టు మేనేజ్మెంట్ అతనికి తెగ విశ్రాంతినిస్తుంది. వెస్టిండీస్ పర్యటనకు పూర్తిగా దూరమైన కోహ్లీ జింబాబ్వేతో జరిగే వన్డే సిరీస్కు కూడా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలోనే ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ విరాట్ కోహ్లీ గురించి అతని గణాంకాలు గురించి ఎలుగెత్తి చూపించాల్సిన పరిస్థితి వచ్చిందని అయన వ్యాఖ్యానించారు. కొహ్లీ  ఇటీవలకాలంలో అనుకూల పరిస్థితులకు దూరం అయ్యాడు.  అంటూ చెప్పుకొచ్చాడు వెస్టిండీస్ పర్యటనలో విరాట్ కోహ్లీ ఏ ఒక్క సిరీస్లో అయినా ఆడించి ఉంటే బాగుండేది అంటూ చెప్పుకొచ్చాడు. తర్వాత కాలంలో అతను ఎట్టి పరిస్థితుల్లో జట్టులోకి వస్తాడు అని చెప్పడంలో సందేహం లేదుఅంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ గణాంకాలను అందరికీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది.


 రోహిత్ శర్మ సూర్య కుమార్ యాదవ్ అన్ని మ్యాచ్ లలో పెద్దగా ఆడకపోయినా కానీ రెగ్యులర్ గా ఆడుతూ ఉన్నారు. ఆడిన మంచి ఇన్నింగ్స్ కి ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. విరాట్ కోహ్లి విషయంలో అలా జరగటం లేదు. టీమిండియా ఆటగాళ్లను ఏ స్థానంలో ఎవరిని ఉంచాలన్నది ఫిక్స్ అవ్వాలి. ముఖ్యంగా ఇటీవలి వెస్టిండీస్ పర్యటనకు సూర్య కుమార్ యాదవ్ 4వ స్థానంలో కాకుండా ఓపనర్ గా రావటం  ఆశ్చర్యపరిచింది.  అయితే సూర్యకుమార్ యాదవ్ ను ఓపెనర్గా పంపించటం వెనుక ఉన్న ఆలోచన ఏంటో అన్నది మాత్రం అర్థం కావడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు ఆకాష్ చోప్రా..

మరింత సమాచారం తెలుసుకోండి: