ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ లో భాగంగా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బౌలర్లతో చెడుగుడు ఆడుతున్నారు అని చెప్పాలి. బౌలర్లపై కాస్తైనా కనికరం చూపించకుండ దారుణం గా బాదేస్తున్నారు. ఈ క్రమంలోనే ది 100 లీగ్లో భాగంగా వరుసగా సెంచరీలు నమోదు అవుతూ ఉండటం గమనార్హం. ఇక ఇలా ప్రతి బ్యాట్స్మెన్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్న నేపథ్యంలో అటు ప్రేక్షకుల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తుంది అని చెప్పాలి. అంతేకాదు ఈ లీగ్ లో భాగంగా బ్యాట్స్మెన్లు మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ ఉండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది.


 ఈ క్రమంలోనే ఇటీవల ఒక బ్యాట్స్ మెన్ ఏకంగా బౌలర్ల పై వీరవిహారం చేస్తూ  చితక్కొట్టుడు కొట్టాడు. బౌలర్లకు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వీరవిహారం చేసాడు అని చెప్పాలి. వచ్చిన ప్రతి బంతిని కూడా బౌండరీకి తరలించడమే లక్ష్యంగా చెలరేగిపోయాడు. 48 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు అనే చెప్పాలి.  మెరుపు ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్మెన్ ఎవరో కాదు విలువ జాక్స్. అయితే అంతకు ముందు 20 ఏళ్ల విల్ స్పీడ్ కేవలం 50 బంతుల్లో 8 ఫోర్లు 6సిక్సర్ల సహాయంతో సెంచరీ మార్క్ దాటేసాడు.


 ఇక ది హండ్రెడ్ లీగ్లో భాగంగా సెంచరీ సాధించిన మొదటి ఆటగాడిగా కూడా అరుదైన రికార్డు సాధించాడు అనే చెప్పాలి. అయితే ఇదే గొప్ప ఇన్నింగ్స్ అనుకుంటే ఇంతకుమించి ఇన్నింగ్స్ ఆడాడు  ఇన్విన్సిబుల్స్ కి చెందిన 23 ఏళ్ల విల్ జాక్స్.  48 బంతుల్లోనే మూడంకెల స్కోర్ అందుకోవడం గమనార్హం. ఇక ఇన్నింగ్స్ లో పది ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయి. సెంచరీతో అజేయంగా నిలిచిన అతను జట్టును విజయతీరాలకు చేర్చటంలో  కీలకపాత్ర వహించాడు. విల్ స్ఫీడ్ సెంచరీ సాధించిన సదరన్ బ్రేవ్ పైనే అటు విల్ జాక్స్ కూడా సెంచరీ సాధించడం గమనార్హం. తొలుత సదరన్ బ్రేవ్ జట్టు బ్యాటింగ్ చేసింది 100 బంతుల్లో 137 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత ఇన్విన్సిబుల్స్  కి చెందిన ఆటగాడు విల్ జాక్స్ 225 స్ట్రైక్ రేట్ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: