సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో బౌలర్లు బ్యాట్స్మెన్స్ పై ఆధిపత్యం సాధించడం కోసం ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైవిధ్యమైన బంతులను సందిస్తూ ముప్పుతిప్పలు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ లకు ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు అని చెప్పాలి.


 పరుగులు చేసేందుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఎంతో తెలివిగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పట్టేశారు. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి సౌత్ ఆఫ్రికా కేవలం 151 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రబడ 36 పరుగులతో సౌతాఫ్రికా తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ మూడు వికెట్లు, బ్రాడ్ మూడు వికెట్లు, బెన్ స్టోక్ రెండు వికెట్లు తీశారు.  అయితే ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ను  అవుట్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 బ్యాటింగ్ కూ వచ్చిన ఎల్గర్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఎంతో కట్టుదిట్టమైన బంతులు వేసి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. చివరికి ఒక తెలివైన బంతితో బోల్తా కొట్టించి వికెట్ పట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. అయితే తొలి నాలుగు బంతుల్లో రెండుసార్లు  అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఎల్గర్ చివరికి 5 బంతికి మాత్రం దొరికిపోయాడు అని చెప్పాలి. స్లీప్ లో ఉన్న ఫీల్డర్ చేతికి క్యాచ్ ఇచ్చి చివరికి పెవిలియన్ చేరాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: