మొన్నటి వరకు జట్టులో సీనియర్ ఆటగాళ్లు గా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ జట్టును విజయతీరాలకు నడిపించినవారూ ru. ఇక ఇప్పుడు టీమిండియా విజయంలో విలన్ లుగా మారిపోతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం టీమిండియా కెప్టెన్గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ కెప్టెన్సీ పరంగా బాగున్నప్పటికీ ఇక వ్యక్తిగత ఆట పరంగా మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోతున్నాడు. ప్రస్తుతం భారత జట్టు ఎటాకింగ్ గేమ్ ఆడుతూ ఉండగా.. ఈ వ్యూహంలో జట్టును బలహీనపరుస్తుంది మాత్రం సీనియర్ ఆటగాళ్లే అన్నది ప్రతి మ్యాచ్ లో రుజువవుతోంది. ప్రస్తుతం రోహిత్ శర్మ కె.ఎల్.రాహుల్ విరాట్ కోహ్లీ ముగ్గురు కూడా టి20 క్రికెట్ లో బ్యాడ్ ఫామ్ లో కొనసాగుతున్నారు.
ఒక రకంగా జట్టును విజయతీరాలకు నడిపించాల్సిన ఈ ముగ్గురు ఇప్పుడు జట్టు విజయంలో మైనస్ గా మారిపోతున్నారు. ఇటీవల జరిగిన మ్యాచ్లో ఈ ముగ్గురు మ్యాచ్ లో కలిపి కేవలం 53 మాత్రమే చేశారు. ఒకప్పుడు భారత్ బ్యాటింగ్ విభాగం మొత్తం ఈ ముగ్గురు పైన ఆధారపడుతూ వచ్చేది. కానీ ఇప్పుడు మొత్తం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టి-20లో మొత్తం ముగ్గురు బ్యాట్స్మెన్లు చివరి ఐదు మ్యాచ్ లలో చూసుకుంటే 12,33, 11, 1,64.. విరాట్ కోహ్లీ 35, 11, 1, 52, 17 పరుగులు.. కేఎల్ రాహుల్ 0, 65, 15, 54, 50 పరుగులు. ఇలా కొన్ని సార్లు పర్వాలేదనిపించినా ఎక్కువ సార్లు విఫలమవుతున్నారు. దీంతో వీరు ఇలాగే కొనసాగితే టీమిండియా టీమిండియా విజయంలో విలన్లు వేరే అవుతారు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి